Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?
- September 4, 2026 / 08:40 AM ISTByPhani Kumar
ఓటీటీలో అత్యంత పాపులారిటీ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఆల్మోస్ట్ 2,3 సీజన్ల వరకు వచ్చాయి. కానీ మొదటి సీజన్ రేంజ్లో మిగిలిన సీజన్లు ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు అదే సిరీస్ ను ఆదారం చేసుకుని సినిమా తీశారు. ‘మీర్జాపూర్ : ది మూవీ'(Mirzapur The Movie) పేరుతో దానిని సెప్టెంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ‘మీర్జాపూర్’ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mirzapur The Movie

బుక్ మై షో యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఇండియా వైడ్ భారీ వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో కొంతమంది పెద్దలకి, సన్నిహితులకు ‘మీర్జాపూర్ : ది మూవీ’ చిత్రాన్ని స్పెషల్ షో వేసి చూపించారట నిర్మాతలు రితేష్ సిద్వాని, ఫరాన్ అక్తర్. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారట. వారి టాక్ ప్రకారం సినిమా 3 గంటల 17 నిమిషాలు ఉందట.
‘మీర్జాపూర్'(ఉత్తరప్రదేశ్) నగరంలో కుర్చీ కోసం జరిగే పోరాటం ఇది అని అంటున్నారు. ‘గద్దె అనేది బంగారం, వెండి లేదా రాజకీయాలతో కాదు, కేవలం బాహుబలంతో (పవర్ తో) నిర్మించబడుతుంది” అంటూ ట్రైలర్లో ఉన్న డైలాగ్ ను బట్టి.. ఇది నిజమే అని అర్దంచేసుకోవచ్చు.కాలీన్ భయ్యా, మున్నా, గుడ్డు – బబ్లూ మధ్య జరిగే ఆదిపత్య పోరులో ఎవరు ఆ కుర్చీని దక్కించుకుంటారు అనేది సినిమా కథాంశం అని అంటున్నారు.
అధికారం కోసం గ్యాంగ్ వార్స్, రక్తపాతం, నమ్మకద్రోహం వంటివి ఏ స్థాయికి వెళ్ళాయనేది సినిమా చూసి తెలుసుకోవాలి అంటున్నారు. సిరీస్ లో బూతుల వాడకం ఎక్కువగా ఉన్నప్పటికీ.. సినిమాకి వచ్చేసరికి వాటి వాడకం కొంతవరకు కంట్రోల్ చేశారని అంటున్నారు. బెడ్ రూమ్ సన్నివేశాల విషయంలో కూడా హద్దులు దాటలేదని చెబుతున్నారు. టార్గెటెడ్ ఆడియన్స్ ను ‘మీర్జాపూర్’ సినిమా ఆకట్టుకునే అవకాశం ఉందంటున్నారు. కానీ మొదటి సీజన్ రేంజ్లో ఇంటెన్సిటీ ఉండదని చెబుతున్నారు. మరి రివ్యూస్ ఎలా ఉంటాయో చూడాలి.















