అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ నెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి, అనుష్క కాంబో సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయని సమాచారం.
చిన్న చిన్న ట్విస్టులు, కామెడీ పంచ్ లు సినిమాకు హైలెట్ కానున్నాయని సమాచారం. నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో జాతిరత్నాలు మ్యాజిక్ ను రిపీట్ చేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రెండు గంటల 31 నిమిషాల నిడివితో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ రన్ టైమ్ పర్ఫెక్ట్ రన్ టైమ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్లను మార్చుకున్న ఈ సినిమా ఈసారి ఎలాంటి ఆవాంతరాలు లేకుండా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాకు (Miss Shetty Mr Polishetty) సెన్సార్ సభ్యుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి నవీన్ పోలిశెట్టి ఎంతగానో కష్టపడుతున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇతర సౌత్ భాషలలో సైతం రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఈ సినిమాతో అనుష్క సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు నవీన్ పోలిశెట్టికి క్రేజ్ పెరుగుతుండగా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే నవీన్ పోలిశెట్టి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. నవీన్ పొలిశెట్టిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!