ప్రియదర్శి హీరోగా నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘మిత్రమండలి’. ప్రసాద్ బెహరా, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ వంటి వారు కీలక పాత్రలు పోషించగా కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు. అలాగే వీటీవీ గణేష్, దర్శకుడు అనుదీప్ కేవీ వంటి వాళ్ళు కూడా స్పెషల్ రోల్స్ పోషించారు. టీజర్, ట్రైలర్స్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 16న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బన్నీ వాస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాని భాను ప్రతాప, కళ్యాణ్ మంతెన, విజయ్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. తమ కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో రిలీజ్ కి ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు ‘మిత్రమండలి’ మూవీ మేకర్స్. మరోపక్క ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న తమ స్నేహితులకు, పెద్దలకు కూడా ఈ సినిమాని చూపించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ‘మిత్రమండలి’ సినిమా రన్ టైం 2 గంటల 18 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. సినిమా స్టార్టింగ్లో ఒక్కో పాత్రని పరిచయం చేసిన తీరు బాగుందట.
వాటి చుట్టూ రాసుకున్న ఫన్ ట్రాక్స్ కూడా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతుందట. సెకండాఫ్ నుండి మెయిన్ ప్లాట్.. కి టర్న్ తీసుకుంటుందట సినిమా. క్లైమాక్స్ లో ఎవ్వరూ ఊహించని ఒక ట్విస్ట్ కూడా ఉంటుందట. అది కూడా ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ‘మిత్రమండలి’ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ప్రీమియర్స్ తో ఎలాంటి టాక్ వస్తుందో.