ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో సినిమా ‘మిత్రమండలి’. నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రసాద్ బెహరా, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 16న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. బన్నీ వాస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫోకస్ అయితే ఉంది. రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ని వదిలారు.
‘మిత్రమండలి’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 44 సెకన్ల నిడివి కలిగి ఉంది. ట్రైలర్ ప్రారంభంలో హీరో అండ్ గ్యాంగ్ కోసం పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. అందులో పోలీస్ వెన్నెల కిషోర్.
ఇక ఆ గ్యాంగ్ అనే ప్రియదర్శి అండ్ ఫ్రెండ్స్(ప్రసాద్ బెహరా, విష్ణు, రాగ్ మయూర్). ఆ తర్వాత హీరోయిన్ నిహారిక ఎన్ ఎం ఎంట్రీ. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ తో హీరోయిన్ లవ్ డ్రామా ఆడటం, ఈ నేపథ్యంలో వచ్చే ఫన్ క్రియేట్ అవుతుంది అని తెలుస్తుంది.
దర్శకుడు అనుదీప్ కూడా ఫన్నీ కేమియో చేసినట్టు స్పష్టమవుతుంది. ‘జాతి రత్నాలు’ రేంజ్లో ఓ హిట్టు కొట్టాలని భావించి దర్శకుడు విజయేందర్ ఎస్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు అనిపిస్తుంది.
కానీ ట్రైలర్లో ఫన్ ఏమాత్రం సినిమాపై ఆసక్తిని రేకెత్తించలేదు. ‘జాతి రత్నాలు’ స్పూఫ్ లా కనిపిస్తుంది ట్రైలర్. అన్నీ ఫోర్స్డ్ పంచ్ డైలాగ్స్ మాదిరి అనిపిస్తున్నాయి. ట్రైలర్ కి ఏమైనా హైలెట్ ఉందా అంటే అది కచ్చితంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి.
ఆర్.ఆర్.ధృవన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :