ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయ్!

మంచు మనోజ్ కథ కొద్ది రోజుల క్రితం భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం జరగడంతో పెద్ద ఎత్తున మనోజ్ వార్తల్లో నిలిచారు. ఇక ఈయన వివాహం చేసుకోవడం మంచు కుటుంబానికి ఇష్టం లేదంటూ ఈయన పెళ్లి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇలా మోహన్ బాబుకు మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతోనే ఈయన పెళ్లి బాధ్యతులను మంచు లక్ష్మి తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే మోహన్ బాబు పెళ్లికి కూడా హాజరు కారంటూ తెలిసింది. కానీ మోహన్ బాబు పెళ్లికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించి ఆ వార్తలను పూర్తిగా ఖండించేశారు. ఇక మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .మోహన్ బాబు మొదటిసారి మనోజ్ పెళ్లి గురించి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతున్న నేను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని నాతో చెప్పారు.

ఒకసారి ఆలోచించుకో అని సలహా ఇచ్చా.. లేదు నాన్న నేను తీసుకున్న నిర్ణయం సరైనది అంటూ చెప్పారు. అయితే బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పాను. మనం చేసే పని మంచిదైతే ఇతరుల గురించి ఆలోచించి అక్కడే ఆగిపోకూడదని తెలిపారు. దారిన ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి మనం ఎన్ని కుక్కలను ఆపగలం.

కుక్కలు మొరుగుతున్నా నీ పని నువ్వు చేయాలి అంటూ ఈ సందర్భంగా మనోజ్ పెళ్లి గురించి విమర్శలు చేసినటువంటి వారిని ఈయన ఏకంగా కుక్కలతో పోలుస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా మోహన్ బాబు మొదటిసారి మనోజ్ పెళ్లి గురించి మాట్లాడుతూ తన పెళ్లి గురించివస్తున్నటువంటి వార్తలపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus