Evaru Meelo Koteeswarulu: మోహన్ బాబు ఆ షోను రిజెక్ట్ చేశారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో జెమినీ ఛానల్ లో ఒక షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 15వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుందని వార్తలు వస్తుండగా ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ షో స్టార్ మా ఛానల్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ప్రసారమైంది. నాగార్జున, చిరంజీవి స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన షోకు హోస్టులుగా వ్యవహరించారు.

అయితే తాజాగా మంచు విష్ణు ఈ షో గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. హిందీలో సక్సెస్ సాధించిన కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ కోసం ఎనిమిది సంవత్సరాల క్రితం జెమినీ ఛానల్ నిర్వాహకులు నాన్నగారిని సంప్రదించారని మంచు విష్ణు చెప్పారు. ఆ సమయంలో ఆ షోను హోస్ట్ చేయడానికి నాన్న ఆసక్తి చూపలేదని అందువల్ల జెమినీ ఛానల్ నిర్వాహకులు ఆ ప్రాజెక్ట్ ను వదిలేశారని మంచు విష్ణు వెల్లడించారు.

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో జెమినీ ఛానల్ నాలుగో స్థానంలో ఉండగా ఎన్టీఆర్ షోకు రికార్డు స్థాయిలో రేటింగ్స్ వస్తాయని బుల్లితెర వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ షోతో హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్ గా పర్ఫెక్ట్ ఛాయిస్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ మోహన్ బాబు ఈ షోను హోస్ట్ చేసి ఉంటే కూడా ఈ షో సక్సెస్ అయ్యేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus