ప్రముఖ దర్శకుడు, సెన్నిబుల్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti).. కొన్ని నెలల క్రితం ‘జటాయు’ అనే సినిమా గురించి చెప్పారు. ఆ ప్రాజెక్ట్ తన డ్రీమ్ సినిమా అని కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ సినిమాను ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిస్తారు అనే ఓ పుకారు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద చర్చ లేకపోవడంతో రూమర్ కూడా కామ్ అయిపోయింది.
ఇప్పుడు మళ్లీ మోహన్ కృష్ణ మీడియా ముందుకు వస్తుండేసరికి ఆ రూమర్ ప్రశ్నగా మారి యాక్టివేట్ అయింది. దీనికి ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశారు. ‘జటాయు’ సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి.. ఆ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ప్రభాస్ లైనప్ విషయంలో వస్తున్న కొన్ని వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లు అయింది.
ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన ప్రస్తుతం లైనప్‌లో ఉన్న సినిమాలను పక్కనపెడతారు అనే పుకార్లు కూడా వచ్చాయి. ఇప్పుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి క్లారిటీతో ప్రభాస్ సినిమాల లైనప్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్లు అయింది. ఇక మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది.
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా రూపొందిన ఈ సినిమాలో రూప కొడువయూర్ (Roopa Kodayur) హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. చాలా నెలల క్రితమే రెడీ అయినా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు 25న పక్కాగా తీసుకొస్తాం అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా గురించి ప్రియదర్శి మాట్లాడుతూ నేను యాక్టర్‌ను కాలేనని కొందరు అన్నారు. వాళ్ల మాటలు పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు అని తన గురించి చెప్పుకొచ్చాడు.