టాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడేవారు అందరూ తెలుగువాళ్ళు కాకపోవడం మన దౌర్భాగ్యం అనుకోవాలో, లేక పక్క బాషల వాళ్ళు వచ్చి మరీ మన తెలుగు పాటలు పాడుతున్నారు అని హ్యాపీ ఫీల్ అవ్వాలో తెలీదు కానీ. మొత్తంగా చూసుకుంటే మాత్రం మన టాలీవుడ్ పాటలు పాడేందుకు బాలీవుడ్ సింగర్స్ ఎగబడుతూ ఉంటారు. ఇక దలర్ మహెందీ గుర్తున్నాడా…అతని తమ్ముడు సైతం తెలుగులో మంచి మంచి పాటలు పాడాడు.
అదేనండి రవితేజ నటించిన బలుపు చింత్రంలో ‘పాతికేళ్ళ చిన్నది’.. ఎన్టీఆర్ నటించిన అదుర్స్ చిత్రంలో ‘పిల్లా నా వల్ల కాదు’ …ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంలోని ‘యాహూ..యాహూ..’ అనే పాటలు పాడిన మికా సింగ్. బహుశా ఈ మహారాజుగారు అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ సారు వేసిన వేషాలు మాత్రం ఎవ్వరూ మరచిపోరు….ఇంతకీ విషయం ఏమిటంటే…ఈ మికా సింగ్ పై ఓ యువతి అత్యాచారం కేసు పెట్టింది. అయితే ఇదేదో మొదటి కేస్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్లే..ఇలాంటివి మనవాడికి అలవాటె… గతంలో రాకీ సావంత్ ని పబ్లిక్ గా లిప్ లాక్ పెట్టి పెద్ద దుమారమే లేపాడు.
ఆ తర్వాత తన షోకి వచ్చిన ఓ డాక్టర్ ని చితక బాది మరో కేసులో ఇరుక్కున్నాడు… ఇలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ మనవాడు మీడియా ఫ్రెండ్లీ అయిపోయాడు. అయితే ఈ కొత్త కేస్ ఏంటి అంటే…ఓ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. అతడిపై ఐపీసీ 354, 504 సెక్షన్ ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే భాదితురాలు చెబుతున్న వివరాలు సైతం కాస్త డౌట్ గా ఉండడంతో ఈ కేస్ ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు. మరి చివరికి ఏం అవుతుందో చూడాలి.