నాకు రెండో దైవం.. మా అమ్మే!

అక్కినేని వారి పెద్ద కోడలు సమంత.. తన భర్త నాగ చైతన్యతో చేసిన “మజిలీ” చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సమంతకు తన తల్లితో మనస్పర్థలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై ఆమె స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఈ వార్తను తెగ వైరల్ చేసేస్తున్నారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సమంత డిసైడ్ అయ్యింది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చేసింది.

సమంత స్పందిస్తూ…. ” మా అమ్మకి నాకు మధ్య విబేధాలున్నాయనడంలో ఎటువంటి నిజం లేదు. నేను అందరికంటే ఎక్కువగా మా అమ్మను నమ్ముతాను. ఆమె చేసే ప్రార్ధనలో ఎదో మాయ ఉంటుంది. చిన్నప్పటిలానే.. నాగురించి ప్రార్ధన చేయమని అమ్మని ఎప్పుడూ అడుగుతుంటాను. ఆమె ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. మా అమ్మమాత్రం తనకోసం తాను ఎప్పుడూ ప్రార్థన చేసుకోదు,అదే ఆమెలో ఉన్న ప్రత్యేకత. రెండో దైవం మా అమ్మే” అంటూ తన తల్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి రూమర్స్‌కి చెక్ పెట్టింది సమంత. ఇక సమంత ప్రస్తుతం నందినిరెడ్డి డైరెక్షన్లో “ఓ బేబీ ఎంత చక్కగున్నావే” చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో సమంత 70 ఏళ్ళ వృద్దురాలిగా కనిపించనుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus