బిగ్ బాస్4 : మోనాల్ మాటలు వైరల్..!

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ స్ట్రాటజీలు ప్రతివారం మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు ఎన్నో కారణాలని చూపించి హౌస్ మేట్స్ ని నామినేట్ చేస్తూ ఉంటారు. 9వ వారం ఈసీజన్ లో అఖిల్ మోనాల్ ని నామినేట్ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు మోనాల్ ని అఖిల్ ఎందుకు నామినేట్ చేశాడు ? దీని వెనక రీజన్ ఏంటి అనేది హౌస్ మేట్స్ కే కాదు, ఆడియన్స్ కి కూడా ప్రశ్నగానే మారింది.

ఎప్పుడైతే మోనాల్ ని అఖిల్ నామినేట్ చేశాడో అప్పుడు హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. లాస్య, అభిజిత్, హారిక మోనాల్ ని నామినేట్ చేస్తున్నాడు ఏంటి అంటూ మాట్లాడుకున్నారు. అమ్మరాజశేఖర్ అయితే మోనాల్ బాధని ఓదార్చాడు కూడా. ఇక్కడే మోనాల్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటే అది వేరే.., వాంట్ మోర్ మోర్ కావాలి అంటూ మాట్లాడింది. అబ్బాయితో ఫ్రెండ్షిప్ అంటే అది వేరు, నేను అమ్మాయి కదా అంటూ మోనాల్ మాట్లాడింది. అదే ఒక మైయిన్ రీజన్ అన్నట్లుగా కూడా అమ్మరాజశేఖర్ ముందు తన బాధని షేర్ చేసుకుంది. అంతేకాదు, ఈ హౌస్ లో రెండు గ్రూప్స్ ఉన్నాయి అందులో నేను లేను నేను ఒంటరిని అంటూ బాధ పడింది మోనాల్.

నిజానికి అఖిల్ మోనాల్ కి క్లారిటీ లేదని , టాస్క్ లలో కూడా లేట్ గా వస్తున్నావ్, అస్సలు పెర్ఫామెన్స్ ఇవ్వట్లేదని అన్నాడు. ఆ రీజన్ తోనే నామినేట్ చేశాడు. ఇది యాక్సెప్ట్ చేసిన మోనాల్ అక్కడ చాలా బాధపడింది కూడా. మరి అఖిల్ ఇలా ఎందుకు చేశాడు..? నిజంగా మోనాల్ చెప్పినట్లుగానే అక్కడ జరుగుతోందా అనేది తెలియాలి. నాగార్జున వీకెండ్ వచ్చి మోనాల్ మాట్లాడిన మాటలు అఖిల్ కి చూపిస్తే అఖిల్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus