బిగ్ బాస్ లవర్స్ అందరూ మోనాల్ – అఖిల్ – అభిజిత్ లని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ.. వాళ్లలో ప్రేమదేశం సినిమాని చూశారు. ముఖ్యంగా మోనాల్ ఇద్దరితోనూ ఉండటం, ఆ తర్వాత మిస్ అండర్ స్టాండిగ్స్ వచ్చి అభిజిత్ మోనాల్ ని దూరంగా పెట్టడం ఇవన్నీ కూడా చూస్తూనే వచ్చారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా అభిజిత్ – అఖిల్ ఇద్దరూ కలిపోవడం అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నిజానికి నామినేషన్స్ ఎపిసోడ్ లో మోనాల్ అన్ని క్లియర్ చేస్కుని అభితో ఫ్రెండ్షిప్ కోసం రెడీ అయ్యింది. కానీ మార్నింగ్ మస్తీలోనే ముస్తఫా, ముస్తఫా అని సాంగ్ పాడేసుకున్నారు అఖిల్ అండ్ అభిజిత్. ఎప్పుడో ఫస్ట్ వీక్ లో అయిన గొడవకి పుల్ స్టాప్ పెట్టారు. ఇందులో ఎవరి అడుగు ముందు ఉంది అనేది బిగ్ బాస్ చూపించకపోయినా , అభిజిత్ ఫస్ట్ వెళ్లి సార్ట్ అవుట్ చేశాడని అఖిల్ తో చెప్పించారు.
ఇక వీరిద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ అయితే మోనాల్ పరిస్థితి ఏంటబ్బా..? అనే ఆలోచనలో పడ్డారు అందరూ. హౌస్ మేట్స్ మాత్రమే కాదు, బయట ఉన్న ఆడియన్స్ సైతం అమోమయంలో పడిన మోనాల్ పరిస్థితి గురించి తెగ ఫీల్ అయిపోతున్నారు.
మరి ఇప్పుడు అభిజిత్ అండ్ అఖిల్ ఇద్దరూ కలిసిపోయారు కాబట్టి చివరివరకూ నిలిచేది ఎవరు.. గెలిచేది ఎవరు అనేది ఆసక్తికరం. ఎందుకంటే, ఒకరు కిందకిలాగితేనే కదా మరొకరు ఎంత స్ట్రాంగ్ గా పైకి వెళ్తున్నారో తెలిసేది. అది లేకుండా ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకరినొకరు నామినేట్ చేసుకోకుండా గేమ్ ఆడితే సీజన్ – 4 లో మజా వస్తుందా..? లేదా మళ్లీ ఇదే మోనాల్ వల్ల ఇద్దరూ విడిపోతారా అనేది చూడాలి.