డైరెక్టర్ కి సింపుల్ గా అనిపించిన సంగతులు ఒక వర్గానికి అవమానంగా అనిపిస్తాయి. బాగా వచ్చాయి అనుకున్న సీన్లు కొందరి మనోభావాలను దెబ్బతీస్తాయి. ఆ విధంగా అనుకోకుండా కొన్ని తెలుగు సినిమాలు వివాదాస్పదంగా నిలిచాయి. కాంట్రవర్సీస్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రాలపై ఫోకస్..
1. దువ్వాడ జగన్నాథమ్అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలోని “ఒడిలో బడిలో” సాంగ్ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. బ్రాహ్మణ సంఘాలు పాటలోని కొన్ని పదాలను తొలిగించే వరకు ఒప్పుకోలేదు. అవి మార్చడంతో రిలీజ్ సవ్యంగా జరిగింది.
2. కెమెరామెన్ గంగ తో రాంబాబుతెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారని తెలంగాణ వాదులు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రిలీజ్ ని అడ్డుకున్నారు. ఈ సినిమాలోని అభ్యంతర సన్నివేశాలను తొలగించిన తర్వాతే తెలంగాణలో విడుదలయింది. భారీ నష్టాలను చూసింది.
3. దేనికైనా రెడీమంచు విష్ణు మూవీ దేనికైనా రెడీ లో బ్రాహ్మణులను హేళన చేశారని కొంతమంది గొడవ చేశారు. ఈ వివాదం చాలా వరకు కొనసాగింది. ఈ మూవీ హిట్ అయినా ఈ గొడవ వల్ల చెడ్డపేరు తెచ్చుకుంది.
4. కృష్ణం వందే జగద్గురుమ్బీజేపీ లీడర్ గాలి జనార్దన్ రెడ్డి ని కృష్ణం వందే జగద్గురుమ్ లో మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారని.. ఈ సినిమా రిలీజ్ కాకుండా నేతలు అడ్డుకున్నారు. ఆ అడ్డంకులు దాటుకొని ప్రసంశలు అందుకుంది.
5. బస్ స్టాప్కాలేజీ విద్యార్థులను నీచంగా చూపించారని బస్ స్టాప్ మూవీ పోస్టర్స్ ని స్టూడెంట్స్ దగ్ధం చేశారు. స్టూడెంట్స్ యూనియన్స్ ఈ సినిమా షోలను అనేక చోట్ల ఆపారు.
6. దరువురవితేజ సినిమాకి టైటిల్ వివాదాస్పదమైంది. దరువు అనేది తమ సంస్కృతిలో భాగమని తెలంగాణ సంస్కృతి సంఘం వ్యతిరేకించింది. చివరకు వారిని నిర్మాత ఒప్పించి సినిమాని రిలీజ్ చేసుకున్నారు.
7. రచ్చరామ్ చరణ్ రచ్చ సినిమాలోని ‘వాన వాన వెల్లువాయే’ పాటలో గౌతమ్ బుద్ధ విగ్రహం ముందు చిత్రీకరించారని మహిళా సంఘాలు రచ్చ చేశాయి. అందుకే ఆ పాటలో బుద్ధుడు కనబడకుండా రీ ఎడిట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు.
8. మగధీరఏం పిల్లాడో వెళదాం వస్తావా అనే విప్లవ గీతాన్ని .. విరహ గీతానికి వాడారని.. అది కూడా రచయిత వంగపండు ప్రసాద్ రావు అనుమతి లేకుండా పాట తీసుకున్నారని పెద్ద గొడవ జరిగింది. చివరికి అతనికి నచ్చచెప్పడంతో వివాదం ముగిసింది. విజయం వరించింది.
ఈ జాబితాలో మేము మిస్ అయిన వివాదాస్పద సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.. యాడ్ చేస్తాం..