24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ను నవంబర్ 22న (నిన్న) సాయంత్రం విడుదల చేశారు. టీజర్ అయితే అద్భుతంగా ఉంది. చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో మహేష్ ను చూడటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎప్పటినుండో ఇలాంటి మాస్ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎదురుచూశాటున్నారు. ఇంతకాలానికి వారి కోరిక నెరవేరబోతుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.

24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన సౌత్ టీజర్స్ లో సెకండ్ ప్లేస్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఉంది. ఈ టీజర్ కు ఏకంగా 14.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. మొదటి స్థానంలో కోలీవుడ్ స్టార్ విజయ్ ‘సర్కార్’ టీజర్ ఉంది. ఇక లైక్స్ విషయంలో అయితే ప్రభాస్ ‘సాహో’ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది. ఇక 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన సౌత్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సర్కార్ : 1180K

2) మెర్సల్ : 728 K

3) సాహో(తెలుగు) : 455K

4) 2.ఓ : 418K

5) ఎన్.జి.కె : 413K

6) అజ్ఞాతవాసి : 412 K

7) పెట్టా : 390 K

8) సరిలేరు నీకెవ్వరు : 386 K

9) సైరా నరసింహా రెడ్డి (2019) : 352 K

10) అరవింద సమేత : 292 K

11) సైరా నరసింహా రెడ్డి (2018) : 290 K

12) మహర్షి : 287 K

13) వివేగం : 286 K

14) భరత్ అనే నేను : 283 K

15) రంగస్థలం : 250 K

16) వినయ విధేయ రామా : 207 K

17) జై లవ కుశ (జై టీజర్) : 192 K

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus