అయోధ్య రామమందిరంపై సినిమా.. విజయేంద్ర ప్రసాద్ హిట్ సాధిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ రచయితలలో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉండగా చాలా సందర్బాల్లో ఆ సెంటిమెంట్ ప్రూవ్ అయింది. అయితే విజయేంద్ర ప్రసాద్ తాజాగా అయోధ్య రామమందిరంపై సినిమా తీస్తున్నట్టు వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ పలు సినిమాలను తెరకెక్కించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.

బాబ్రీ మసీద్ కూల్చివేత నుంచి రామమందిరం ప్రారంభం వరకు ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో విజయేంద్ర ప్రసాద్ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ వయస్సు 81 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. 81 సంవత్సరాల వయస్సులో సైతం విజయేంద్ర ప్రసాద్ వరుసగా సినిమాల కోసం పని చేస్తున్నారు.

మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సైతం విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పని చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కు దర్శకునిగా భారీ విజయం దక్కితే ఫ్యాన్స్ సైతం సంతోషించే అవకాశం ఉంటుంది. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు సైతం ఈ మధ్య కాలంలో వివాదాస్పదం అవుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ కావాలని చెప్పకపోయినా కొంతమంది ఆయన కామెంట్లను నెగిటివ్ గా వైరల్ చేస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ మూవీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన నేపథ్యంలో ఆ సినిమాలోని చరణ్, ఎన్టీఆర్ పాత్రల గురించి కామెంట్లు చేస్తే ఆ కామెంట్లు వివాదాస్పదం అవుతుండటం గమనార్హం. విజయేంద్ర ప్రసాద్ దగ్గర ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే రాజమౌళి స్థాయిలో ( Vijayendra Prasad) విజయేంద్ర ప్రసాద్ కథలకు న్యాయం చేసే దర్శకులు సైతం తక్కువమంది ఉన్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus