‘భీమ్లా నాయక్’ ‘గాడ్ ఫాదర్’ లతో పాటు పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన సినిమాల లిస్ట్..!

2022 సినీ పరిశ్రమకు చాలా స్పెషల్ ఇయర్. ఎందుకంటే చాలా మంది ఫిలిం మేకర్స్ కు ఈ ఏడాది కొత్త పాఠాలు నేర్పింది. కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతాయి అనుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇక హీరో ఇమేజ్ తో సంబంధం లేని సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి.వీటిని ఎవరు చూస్తారు అనుకున్న సినిమాలు సూపర్ సక్సెస్ అందుకోవడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. అన్నిటికీ మించి ఏ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అయితే జనాలను ఆకట్టుకుందో.. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది.

ఇదిలా ఉండగా.. ఒకప్పటిలా సినిమాకి మౌత్ టాక్, క్రిటిక్స్ టాక్ బాగా వచ్చినంత మాత్రాన సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది లేదు. అందుకు కొన్ని సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజానికి అలాంటి సినిమాల కోసమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 2022 లో కొన్ని సినిమాలకు రిలీజ్ రోజు చాలా మంచి టాక్ సంపాదించుకున్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఆశించిన రేంజ్లో ఫలితాలను అందుకోలేకపోయాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా వచ్చిన సినిమా ఇది. మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ వసూళ్లు సాధిస్తుంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది లేదు.ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం వలనే ఈ మూవీ మంచి ఫలితం అందుకోలేదు అని అంతా భావించారు. కానీ టికెట్ రేట్లు ఎంత తక్కువగా ఉన్నా మొదటి వీకెండ్ కే ఈ మూవీ బాక్సాఫీస్ జోరు తగ్గిపోయింది. రూ.110 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.92.28 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.దీంతో బయ్యర్లకు రూ. 17.72 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.ఫైనల్ గా ఈ మూవీ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

2) అంటే సుందరానికి :

నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకుడు. మొదటి రోజు ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశపరిచింది. రూ.31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.21.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.9.78 కోట్ల నష్టం వచ్చింది. ఈ మూవీ ప్లాప్ గా మిగిలింది.

3) విరాట పర్వం :

రానా – సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. రూ.13.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.4.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బయ్యర్లకు రూ.9.37 కోట్ల నష్టాలు వచ్చాయి.

4) సమ్మతమే :

కిరణ్ అబ్బవరం- చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ మూవీకి రిలీజ్ రోజు మంచి టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో మాత్రమే సరిపెట్టుకుంది. రూ.4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.3.10 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

5) అశోకవనంలో అర్జున కళ్యాణం :

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీకి కూడా మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో రూ.4.47 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది.

6) గాడ్ ఫాథర్ :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే రూ.92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.కానీ ఫుల్ రన్లో కేవలం రూ.58.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి…. బయ్యర్లకు రూ.33.35 కోట్ల నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా మిగిలింది.

7) స్వాతి ముత్యం :

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రూపొందిన ఈ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ రిలీజ్ రోజు సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.0.96 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఓవరాల్ గా బయ్యర్లకు ఈ మూవీ రూ.3.04 కోట్ల నష్టాలను మిగిల్చి కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది.

8) ఓరి దేవుడా :

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీలో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించాడు. ‘ఓ మై కడవులే’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.5.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.5.55 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

9) ఊర్వశివో రాక్షశివో :

అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ మూవీకి మొదటి రోజు హిట్ టాక్ లభించింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.6.75 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.3.32 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బయ్యర్లకు ఈ మూవీ రూ.3.43 కోట్లు నష్టాలను మిగిల్చింది.

10) 18 పేజెస్ :

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ కావడానికి చాలా కష్టపడుతుంది. రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రూ.8.32 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus