సూపర్ స్టార్ మహేష్ బాబు కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రిస్క్ ఎక్కువ ఉన్నప్పటికీ విభిన్న కథలను చేయడానికి ఇష్టపడుతారు. విజయం సాధిస్తుందని తెలిసినప్పటికీ తనకి ఇష్టంలేని కథలను చేయరు. అలా మహేష్ వదులుకున్న సినిమాలపై ఫోకస్..
మనసంతా నువ్వే
ఉదయ్ కిరణ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం మనసంతా నువ్వే. ఈ కథ మొదట మహేష్ వద్దకే వచ్చింది. మంచి ప్రేమ కథ అయినప్పటికీ రిజెక్ట్ చేశారు.
ఏ మాయ చేసావే
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యం ఏ మాయ చేసావే. నాగ చైతన్య, సమంత లకు ఈ చిత్రం కెరీర్ పరంగా, రియల్ లైఫ్ పరంగా మరుపురానిదిగా నిలిచింది. ఎందుకో గానీ ఈ సినిమాని మహేష్ చేయనున్నారు.
రుద్రమదేవి
గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నా రెడ్డి పాత్ర ప్రత్యేకమైంది. ఈ పాత్రలో నటించమని డైరక్టర్ మొదట మహేష్ ని అడిగారు. కానీ ఆ పాత్రను చేయడానికి ఆసక్తి చూపించలేదు. అల్లు అర్జున్ కి ఈ రోల్ అవార్డులను తెచ్చి పెట్టింది.
24
సూర్య త్రి పాత్రాభినయం చేసిన సినిమా 24 . హీరోగా విలన్ గా అద్భుతంగా నటించి హిట్ అందుకున్నారు. ఈ స్టోరీని విక్రమ్ కుమార్ తొలుత మహేష్ కి వినిపించారు. బాగా నచ్చినప్పటికీ విలన్ రోల్ చేయడం ఇష్టం లేక వదులుకున్నారు.
అ .. ఆ
కృష్ణ చేసిన కుటుంబ కథ చిత్రం “మీనా” కి మార్పులు చేసి త్రివిక్రమ్ అ .. ఆ సినిమా చేశారు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరోగా మహేష్ అని అనుకున్నారు. అతను వద్దనే సరికి నితిన్ కి వెళ్ళింది.
ఫిదా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీలో డైరక్టర్ ఫస్ట్ అనుకున్న హీరో మహేష్. ఈ కథ మహేష్ కి నచ్చి కొన్ని రోజులు తన దగ్గర పెట్టుకున్నారు కూడా. కానీ ఎటువంటి అంచనాలు లేకున్నా హీరో అయితే బాగుంటుందని భావించి చేయనున్నారు. వరుణ్ తేజ్ హిట్ ని సొంతం చేసుకున్నారు.
ఇడియట్
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం రవితేజ కు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ కథని మొదట మహేష్ కోసం రాసుకున్నాడట పూరి. అయితే కొన్ని కారణాల వల్ల రవితేజతో చేసాడు.
గజిని
ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే మొదట ఈ చిత్రాన్ని మహేష్ తో చేయాలని ముందుగా అనుకున్నాడు. దగ్గుబాటి రానా కూడా ఈ చిత్రం రైట్స్ ను తీసుకోవాలని భావించాడట. అయితే కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు.
వర్షం
శోభన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ‘ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్’ గా నిలిచింది. మహేష్ కు ‘బాబీ’ లాంటి ప్లాప్ ఇచ్చిన దర్శకుడు శోభన్ ఈ కథని కూడా ముందు మహేష్ కే వినిపించాడు. కానీ అప్పటికి ‘నాని’ ‘అర్జున్’ ‘అతడు’ వంటి వరుస చిత్రాలతో బిజీగా ఉండడంతో చేయలేకపోయాడు.
గ్యాంగ్ లీడర్
నాని హీరోగా రాబోతున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ముందుగా మహేష్ కు వినిపించాడు. అయితే వరుస కమిట్మెంట్స్ తో మహేష్ బిజీగా ఉండడంతో చేయలేకపోయాడు.
దీంతో మహేష్ నో అంటే ఆ కథ హిట్ అవుతుందనే నమ్మకం టాలీవుడ్ లో బలపడింది.