రకుల్ అరెస్ట్ అయితే ఆ సినిమాల పొజిషన్ ఏంటి?

సుశాంత్ సూసైడ్ మిస్టరీ నుండి డ్రగ్స్ ఇష్యూకి టర్ను తీసుకున్న కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వచ్చింది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ… బాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న రకుల్ మాదకద్రవ్యాలు (డ్రగ్స్) తీసుకున్నట్టు ఇంకా నిర్ధారణ కాలేదు. జస్ట్ పేరు వచ్చిందంతే! ఇన్ కేస్… రకుల్ అరెస్ట్ అయితే? ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లలో తమ తమ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది ఏమో అని టెన్షన్ మొదలైంది. రియా చక్రవరి చేతిలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు ఏవీ లేకపోవడం ఎవరి మీద ఎఫెక్ట్ పడలేదు.

రకుల్ ప్రీత్ సింగ్ పొజిషన్ అలా కాదు. ఆల్మోస్ట్ ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. కొన్ని డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. ఇన్ కేస్ రకుల్ అరెస్ట్ అయ్యితే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పడేది తెలుగు సినిమా మీదే. క్రిష్ డైరెక్షన్‌లో చిరంజీవి మేనల్లుడు, ‘ఉప్పెన’తో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న పంజా వైష్ణవ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ మూవీ రిలీజ్‌కి ముందే సెకండ్ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు. అందులో రకుల్ హీరోయిన్. ఆల్రెడీ వికారాబాద్ ఫారెస్ట్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్‌లో రకుల్ జాయిన్ అయ్యారు. 40 డేస్ షెడ్యూల్‌లో సినిమాను కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేశారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రకుల్‌కి నోటీస్ ఇచ్చి ఇంటరాగేషన్‌కి రమ్మని అంటే ముందుగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ బాలీవుడ్ మూవీపై ఎఫెక్ట్ ఉంటుంది. బాలీవుడ్‌లో అర్జున్ కపూర్‌తో రకుల్ ఒక సినిమా చేస్తోంది. అన్‌లాక్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ముంబైలో జరిగిన షెడ్యూల్‌లో రకుల్ షూటింగ్ చేశారు. దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ‘ఇండియన్ 2’లో సిద్ధార్థ్ సరసన రకుల్ నటిస్తోంది. అక్టోబర్‌లో షూట్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారు. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా షూటింగ్ డిస్టర్బ్ అయ్యినా నెక్స్ట్ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus