Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా ‘బబుల్ గమ్’ తర్వాత రూపొందిన రెండో సినిమా ‘మోగ్లీ'(Mowgli). 2020 లో వచ్చిన ఓటీటీ హిట్ ‘కలర్ ఫోటో’ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన సినిమా ఇది. బండి సరోజ్ ఈ సినిమాలో విలన్ గా నటించడం ఆసక్తికర అంశం.

Mowgli Collections

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ కానీ, ట్రైలర్ కానీ సినిమాపై ఎటువంటి బజ్ ను క్రియేట్ చేయలేదు. కానీ ‘అఖండ 2’ వల్ల వాయిదా పడే ప్రమాదంలో పడినప్పుడు దర్శకుడు సందీప్ రాజ్ చేసిన ఎమోషనల్ ట్వీట్ పబ్లిసిటీ వచ్చేలా చేసింది.

కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఆ పబ్లిసిటీ ఫలించలేదు. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. వీక్ డేస్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.21 cr
సీడెడ్ 0.07 cr
ఆంధ్ర(టోటల్) 0.18 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.46 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.03 cr
ఓవర్సీస్ 0.07 cr
టోటల్ వరల్డ్ వైడ్ 0.56 కోట్లు(షేర్)

‘మోగ్లీ'(Mowgli) చిత్రానికి రూ.3.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజుల్లో ఈ సినిమా రూ.0.56 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.44(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమా ఉండటంతో ఈ సినిమాని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. పెద్ద సినిమాల పక్కన ఇలాంటి చిన్న సినిమాలు వస్తే.. ఏ రేంజ్లో దెబ్బపడిందో చెప్పడానికి ఈ సినిమా ఓ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు.

5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus