MP Ranjeet Ranjan: ‘పుష్ప’, ‘యానిమల్’ మీద ఎంపీ విమర్శలు… ఇలా అయితే కష్టం అంటూ…

సినిమాలు ప్రేక్షకుల్ని చెడగొడుతున్నాయా? సమాజంలో జరిగేది సినిమాల్లో చూపిస్తున్నారా? ఈ చర్చ ఇప్టటిది కాదు. ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. రెగ్యులర్‌గా కాకుండా దర్శకులు కొత్తగా ప్రయత్నించినప్పుడు, లేదంటే వైలెన్స్‌, బోల్డ్‌నెస్‌ ఎక్కువైనప్పుడు ఈ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. ఇన్నాళ్లూ బయట జరిగిన ఈ చర్చ ఇప్పుడు రాజ్యసభ వరకు వెళ్లింది. ఇటీవల ఓ ఎంపీ ఈ విషయం గురించి రాజ్యసభలో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌కు ఎంపీ రంజిత్ రంజన్ రాజ్యసభ్యలో ‘పుష్ప’, ‘యానిమల్’, ‘కబీర్ సింగ్’ సినిమాల గురించి ఇటీవల ప్రస్తావంచారు.

ఆమె లేవనెత్తిన అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ఆయా సినిమాల్లో హీరోలను విపరీత ప్రవర్తనతో చూపించారని, ఆ సినిమాల్లో ఆడవాళ్ల పట్ల అనైతిక ప్రవర్తనలు ప్రేరేపించేలా ఉన్నాయి అని అన్నారు. అంతేకాదు వాటి వల్ల ఆ ప్రభావం సమాజం మీద పడుతోందని ఆమె విమర్శించారు. తన కుమార్తె ‘యానిమల్’ చూస్తూ మధ్యలో ఏడుస్తూ వచ్చేసింది అని కూడా చెప్పారు.

 

ఇలాంటి సినిమాల వల్ల యువత ఆలోచనలు పెడదారి పట్టే ప్రమాదం ఉందని సభ్యులందరికీ తన మనోభావాల్సి తెలియజేశారు. దీంతో సినిమాలు వర్సెస్‌ సమాజం అనే టాపిక్‌ చర్చలోకి వచ్చింద. సినిమాలు చూసి ప్రజానీకం ప్రభావితం అవుతారా అంటే… కారు అని చెప్పడానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ‘భారతీయుడు’, ‘ఠాగూర్’, ‘అపరిచితుడు’, ‘స్టాలిన్‌’ లాంటి సినిమాలు చూసి జనాలకు మంచి చేయడం, లంచాలు తీసుకోవడం అందరూ మానేయలేదు.

అంతేకాదు ఆనాడు బ్రిటిష్ వారిపై సిక్కు వీరులు పోరాటం చేసిన పాటను (Animal) ‘యానిమల్’ సినిమాలో హింస కోసం వాడుకున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలని ఏమాత్రం సహించకూడదని రంజీత్ రంజన్ అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విషయం ఇంకెంతవరకు వెళ్తుంది అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. పార్లమెంట్‌ ఈ విషయంలో ఏమన్నా ఆలోచన చేస్తుందా? ప్రభుత్వం ఏమన్నా చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది త్వరలో తేలుతుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus