Bhagyashri Borse: భాగ్యశ్రీ తొలి సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’ కాదు.. మరేంటో తెలుసా?

భాగ్యశ్రీ భోర్సే.. సినిమాల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. తెలుగు సినిమాల్లోకి వచ్చి ఏడాది దాటిపోయింది. అయితే ఆమె తొలుత ఓకే చేసిన సినిమా ఇంకా విడుదల కాలేదు అని తెలుసా? మొన్నీమధ్యనే షూటింగ్‌ ప్రారంభించుకుంది అని తెలుసా? భాగ్యశ్రీ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆమె కెరీర్‌ ప్రారంభం కాకముందు ఓకే చేసిన తొలి చిత్రం. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి చెప్పుకొచ్చారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కాంత’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. అందులోనే ఈ విషయం బయటికొచ్చింది.

Bhagyashri Borse

ఈ నెల 14న విడుదల కానున్న ‘కాంత’ సినిమా విడుదలయ్యాక అభిమానులంతా దుల్కర్‌ సల్మాన్‌ను నటచక్రవర్తి అని పిలుస్తారని రానా ఓ రేంజి ఎలివేషన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత భాగ్యశ్రీ భోర్సే గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి హీరోయిన్‌ కోసం 100 మందికిపైగా నటీమణుల్ని ఆడిషన్ చేశారట. అలా ఆడిషన్‌కి వచ్చిన భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాకు ఎంపికైందట. ఈ సినిమాతోనే ఆమె తెలుగు సినిమాకు పరిచయం కావాల్సి ఉన్నా వివిధ కారణాల సినిమా ఆలస్యమైందని రానా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా మొదలై, పూర్తయ్యేసరికి ఆమె తర్వాత ఓకే చేసిన సినిమాలు విడుదలయ్యాయని రానా చెప్పాడు.

ఇక సినిమా విషయానికొస్తే.. హైదరాబాద్‌లో స్టూడియోలు లేని సమయంలో హైదరాబాద్‌ వచ్చాం. అన్నపూర్ణ, రామా నాయుడు, పద్మాలయ స్టూడియోల నిర్మాణం అవుతున్నప్పుడు ఎక్కువగా గాసిప్స్‌ వచ్చేవి. స్టూడియోల్లో ఏం జరుగుతుందనేది అప్పట్లో చాలామంది తక్కువ మందికే తెలిసేది. ఆ నేపథ్యంలో రాసుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక భాగ్యశ్రీ విషయానికొస్తే ‘యారియాన్‌ 2’తో బాలీవుడ్‌లో నటిగా ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత ‘చందు ఛాంపియన్‌’లో చిన్న పాత్ర వేసింది.

తెలుగులో ‘మిస్టర్‌ బచ్చన్‌’తో కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత ‘కింగ్డమ్‌’ సినిమాలో నటించింది. అయితే రెండు సినిమాలూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు రానున్న ‘కాంత’, ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’ మీద ఆమె కెరీర్‌ ఆధారపడి ఉంది అని చెప్పాలి.

మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus