టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మృణాల్ ఠాకూర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. తెలుగులో వరుసగా ఆఫర్లను అందుకుంటున్న ఈ బ్యూటీ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బ్యూటీ గతంలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో శరీరం గురించి అసభ్యకర కామెంట్లు చేశారని తెలిపారు. గ్లామర్ రోల్స్ కు సూట్ అయ్యే విధంగా నేను లేనని కామెంట్లు చేశారని ఆమె వెల్లడించారు.
నేను చేసిన రోల్ బాగుందని అయితే ఆ పాత్రకు అనుగుణంగా నేను కనిపించలేదని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. నా ఫోటో కూడా చూడకుండానే ఒక ఫోటోగ్రాఫర్ ఈ కామెంట్లు చేశాడని మృణాల్ అన్నారు. ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరని కామెంట్లు చేశాడని ఆమె తెలిపారు. నేను ఏ రోల్ లో చేసినా నాకు నచ్చిన విధంగా ఉండటానికి ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు. ఒక సాంగ్ షూట్ లో పాల్గొన్న సమయంలో కొంతమంది బరువు తగ్గాలని సలహాలు ఇవ్వగా వాళ్లకు నేను గట్టిగా ఇచ్చిపడేశానని ఆమె వెల్లడించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా బాడీ షేమింగ్ అనుభవాలు ఎదురయ్యాయని మృణాల్ అన్నారు. మృణాల్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. మృణాల్ కు ఈ తరహా చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మృణాల్ ఠాకూర్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎక్కువ సినిమాలలో నటించడం కంటే తక్కువ సినిమాలలో నటించినా మంచి రోల్స్ లో నటించాలని భావిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. మృణాల్ ఠాకూర్ ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!