Guntur Kaaram: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత నాగవంశీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ ల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ తండ్రి దివంగత స్టార్ హీరో కృష్ణ జయంతి అయిన మే 31 నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ చిత్రానికి నిర్మాత చినబాబు అయినప్పటికీ నిర్మాణంలో అన్ని బాధ్యతలు తీసుకునేది అతని సోదరుడి కొడుకు నాగ వంశీ అనే చెప్పాలి. తాజాగా నాగవంశీ తన ‘మ్యాడ్’ సినిమా ప్రమోషన్లో ‘గుంటూరు కారం’ పై స్పందించారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటల రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మహేష్ బర్త్ డే అయిన ఆగస్టు 9 కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుంది అన్నారు.

అలాంటిదేమీ జరగలేదు. అయితే ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది అని నాగ వంశీ చెప్పుకొచ్చారు. దసరా పండుగలోపు ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ఉంటుందని ఆయన తెలియజేశారు. దీంతో మహేష్ అభిమానులకి కొంత రిలీఫ్ దొరికినట్టు అయ్యింది. ఇక ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా 2024 జనవరి 12 లేదా 13 న రిలీజ్ కానుంది.

Singer Sreerama Chandra Exclusive Interview | Papam Pasivadu | Filmy Focus Originals

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus