Mukhachitram: ముఖచిత్రం సినిమాకి అలా విశ్వక్ గెస్ట్ రోల్ కలిసొస్తుందా?

వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు.. హీరో హీరోయిన్లుగా విశ్వక్ సేన్ , బొమ్మాళి రవి శంకర కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ముఖచిత్రం. గంగారాం డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రానికి కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్… కథ, మాటలు, స్క్రీన్ ప్లే ని అందించారు. ఎస్ కె ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి.

వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా పై ఆసక్తి పెరిగేలా చేసింది.ఈ మూవీలో విశ్వక్ సేన్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.విచిత్రం ఏమిటంటే.. ముఖ చిత్రం టీజర్ ను లాంచ్ చేయడానికి వెళ్లిన విశ్వక్ సేన్.. ట్రైలర్ లాంచ్ టైంకి ఈ సినిమాలో ఓ నటుడిగా మారాడట. నిజానికి మొదట ఈ సినిమాలో విశ్వక్ సేన్ భాగం కాదు. కానీ టీజర్ లాంచ్ కు వెళ్ళినప్పుడు 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయితే అతనికి అది చూపించారు.

అలాగే సినిమాలో లాయర్ పాత్ర ఎంత ముఖ్యమో చెప్పారు మేకర్స్. అంతే ఈ సినిమాలో నటించడానికి అతను ఓకె చెప్పాడు. అలా అతను ముఖ చిత్రంలో భాగమయ్యాడు. చిన్న సినిమాలకు బిజినెస్ అవ్వడం చాలా కష్టం. అయితే ముఖ చిత్రం కి బిజినెస్ బాగానే జరుగుతుందట. అందుకు విశ్వక్ సేన్ ఇమేజ్ కూడా యాడ్ అయ్యింది అని వినికిడి.

అలా అని విశ్వక్ కు భారీ మార్కెట్ ఏమీ లేదు. అతనికి ఉన్న రూ.5 కోట్ల థియేట్రికల్ మార్కెట్ లో దీనికి ఒక రూ.2 కోట్లు, రూ.2.5 కోట్లు జరుగుతుంది అంతే అన్నమాట.ఏది ఏమైనా చిన్న సినిమాకి విశ్వక్ వంటి క్రేజీ హీరో సపోర్ట్ పనికొచ్చినట్టే కనిపిస్తుంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus