Mukhachitram: ముఖచిత్రం మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు.. హీరో హీరోయిన్లుగా విశ్వక్ సేన్ , బొమ్మాళి రవి శంకర కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ముఖచిత్రం. గంగారాం డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రానికి కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్… కథ, మాటలు, స్క్రీన్ ప్లే ని అందించారు. ఎస్ కె ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి.

సినిమాలో విశ్వక్ సేన్ వంటి క్రేజీ హీరో ఉండటం వల్ల..ఇది చిన్న సినిమా అయినప్పటికీ మంచి బిజినెస్ జరిగింది అని చెప్పాలి. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 0.45 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర 0.55 cr
ఏపీ +తెలంగాణ 1.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.15 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.35 cr

ముఖచిత్రం చిత్రానికి రూ.1.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.1.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే కష్టమే. హిట్ 2 సినిమా ఈ వీకెండ్ కూడా జోరు చూపించే అవకాశాలు ఉన్నాయి.

మరోపక్క సత్య దేవ్.. తమన్నా లు నటించిన గుర్తుందా శీతాకాలం కూడా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలతో పోటీ పడి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus