Mukhachitram Collections: ‘ముఖచిత్రం’ మొదటి రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే..!

వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు.. హీరో హీరోయిన్లుగా విశ్వక్ సేన్ , బొమ్మాళి రవి శంకర కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ముఖచిత్రం. గంగారాం డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రానికి కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్… కథ, మాటలు, స్క్రీన్ ప్లే ని అందించారు. ఎస్ కె ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ లు బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే డిసెంబర్ 9న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ కూడా పెద్దగా నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.06 cr
సీడెడ్ 0.03 cr
ఆంధ్ర 0.07 cr
ఏపీ +తెలంగాణ 016 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.01 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.17 cr

‘ముఖచిత్రం’ చిత్రానికి రూ.1.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.1.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకున్న ఈ చిత్రం కేవలం రూ.0.17 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ.1.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

పోటీగా చాలా సినిమాలు ఉండటం.. అలాగే ‘హిట్2’ ‘లవ్ టుడే’ వంటి సినిమాలు స్ట్రాంగ్ గా రన్ అవుతుండటం వల్ల ఈ మూవీ క్యాష్ చేసుకోలేకపోతుంది అని స్పష్టమవుతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus