Mukku Avinash: ఫ్రీగా మందు పంచిన అవినాష్.. ఎమోషనల్ అయిన మందు బాబులు!

  • February 3, 2024 / 01:27 PM IST

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ముక్కు అవినాష్ ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ ద్వారా మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి అవినాష్ ప్రస్తుతం స్టార్ మా కార్యక్రమాలలో కొనసాగడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన బిగ్ బాస్ సోహెల్ హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్లను కాస్త భిన్నంగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అవినాష్ కూడా బూట్ కట్ బాలరాజు సినిమాని తన స్టైల్ లో ప్రమోషన్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన ఒక మందు షాపు వద్దకు వెళ్లి అక్కడున్నటువంటి మందుబాబులను తనకు ఒక 90 ఇప్పించాలని కోరారు. దీంతో అక్కడున్నటువంటి వారు మేము ఇప్పిస్తామంటే మేము ఇప్పిస్తామని అవినాష్ (Mukku Avinash) మాత్రం అక్కడ ఉన్న వారందరికీ కూడా 90 సీసాలు అందించి వారిని సంతోష పెట్టారు.

ఈ క్రమంలోనే ఒక మందుబాబు నువ్వు దేవుడివు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా మందు బాబులకు మందు సీసాలు ఫ్రీగా పంచినటువంటి అవినాష్ తప్పకుండా బూట్ కట్ బాలరాజు సినిమాని చూడాలని తెలిపారు. అలాగే బైక్ పై వెళ్తూ అభిమానులను పలకరిస్తూ ఈయన బూట్ కట్ బాలరాజు సినిమా తప్పకుండా చూడాలి అంటూ సరికొత్తగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus