Mumaith Khan: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో ముమైత్ ఎంట్రీ..! షాక్ అయిన హౌస్ మేట్స్..!

  • March 31, 2022 / 09:25 AM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఐదోవారం టాస్క్ అనేది విభిన్నంగా ఇచ్చాడు బిగ్ బాస్. అఖిల్ ని, బిందుని భార్యభర్తలు గా మార్చి వాళ్లకి డివోర్స్ తీస్కోబోతున్నారని కోర్టులో వాదించాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికోసం బిందు తరపున లాయర్ గా శివ, అఖిల్ తరపున లాయర్ గా నటరాజ్ లని పెట్టారు. ఇక్కడే జడ్జిగా హౌస్ లోకి ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాదు, ముమైత్ రాగానే ఆమెని హగ్ చేసుకునేందుకు పరిగెత్తారు.

Click Here To Watch NOW

కానీ, ముమైత్ చాలా స్ట్రిక్ట్ గా నేను జడ్జిని అంటూ చెప్తూ జడ్జి ఛైర్ లో కూర్చుంది. దీంతో అందరూ సైలెంట్ అయిపోయారు. కోర్టు ప్రొసీడింగ్స్ బ్రేక్ రాగానే, హౌస్ మేట్స్ అందరూ ముమైత్ ఖాన్ తో సరదాగా మాట్లాడారు. రీ ఎంట్రీ ఇచ్చేశావా అంటూ మాట్లాడారు. ఎమోషనల్ గా హగ్ చేసుకున్నారు. ముఖ్యంగా తేజు ముమైత్ రాకతో ఫుల్ ఎనర్జీ వచ్చినట్లుగా అయ్యింది. నిజానికి నటరాజ్ మాస్టర్ తో ఉన్న కనక్షన్స్ కట్ అయిపోవడం, అదే టైమ్ లో ముమైత్ రావడంలో తేజు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది.

ఇక టాస్క్ లో రెండు టీమ్స్ గా విడిపోయిన హౌస్ మేట్స్ కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇక్కడ అఖిల్ టీమ్ లో తేజస్వి, అషూరెడ్డి, అజయ్, నటరాజ్ మాస్టర్, స్రవంతిలు ఉన్నారు. అలాగే, బిందు టీమ్ లో హమీదా, అరియానా, శివ, మహేష్ విట్టా, మిత్రా శర్మాలు ఉన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ తో హౌస్ బాగా వేడెక్కిపోయింది. హౌస్ మేట్స్ అందరూ లాజికల్ గా పాయింట్స్ మాట్లాడుతూ నామినేషన్స్ ని తలపించారు. అందరూ వాళ్ల వాళ్ల ఓపీనియన్స్ ని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. అకిల్ తరపున అషూరెడ్డి, తేజు ఇద్దరూ కూడా బలంగా వాదించారు. అలాగే బిందు తరపున అరియానా, ఇంకా హమీదాలు వాదించారు. నిజానికి కోర్టు ప్రొసీడింగ్స్ హౌస్ లో వాళ్లు కొట్టుకునేలా చేశాయనే చెప్పాలి.

ఫైనల్ గా ఈ టాస్క్ అనేది హౌస్ లో మంచి కిక్ ఇచ్చింది. హౌస్ మేట్స్ అందరూ ఎవరూ ఎలా మాట్లాడతారు అనేది రియల్ ఫేస్ లని బయటకి తీస్కుని వచ్చింది. ఇక్కడే అకిల్ కి సపోర్ట్ చేసిన అషూరెడ్డి బిందుతో చాలాసేపు ఆర్గ్యూ చేసింది. బిందు ఎలా బిహేవ్ చేస్తుందో అషూ చెప్పే ప్రయత్నం చేసింది. కేవలం నామినేషన్స్ ఉన్నాయని చెప్పే అఖిల్ తో వచ్చి మాట్లాడిందని, సారీ చెప్పిందని అన్నది. అలాగే, కెప్టెన్సీ టాస్క్ లో కూడా అందరికీ సపోర్ట్ చేయడానికి కారణం అదే అని కూడా చెప్పింది. ఇక ముమైత్ ఖాన్ ఇప్పుడు గేమ్ ఎలా ఆడుతుంది అనేది ఆసక్తికరం. జడ్జిమెంట్ అనేది ఇప్పుడు ఎవరికి ఫేవర్ గా ఇస్తుంది. ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus