స్టార్‌ హీరోలను కలుపుతున్న స్టార్‌ డైరక్టర్‌… బాలీవుడ్‌ మారుతోంది!

కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత బాలీవుడ్‌లో పరిస్థితి బాగా ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. అప్పటి వరకు జనాలు చూసిన చాలా సినిమాలు ఆ తర్వాత చూడటం మానేశారు. సరిగ్గా ఆ సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఓ మాట చెప్పారు. సౌత్‌ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు కలవడం అంటే పెద్ద విషయం కాదు. కానీ బాలీవుడ్‌లో అదో పెద్ద విషయం. తన సినిమా కోసం ఓ హీరోను ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది అని చెప్పుకొచ్చారు.

అయితే ఆయన అన్నాడనో లేక ఇంకే కారణమో కానీ… ఇప్పుడు బాలీవుడ్‌లో మార్పు కనిపిస్తోంది. సినిమా కోసం ఇద్దరు అగ్ర హీరోలు కలుస్తున్నారు. అలాగే ఒక సినిమాలో చిన్న పాత్ర ఉందని చెబితే ఒప్పుకుంటున్నారు. మరోవైపు రెండు కీలక పాత్రలను కలిపడానికి దర్శకులు కూడా ప్రయత్నిస్తున్నారు. తాజాగా షారుఖ్‌ ఖాన్‌ ‘డుంకీ’ సినిమా సెట్స్‌లో సంజయ్‌ దత్‌ కనిపించారు. ఏముంది చిన్న పాత్రలు ఏవైనా కీలకం అనిపిస్తే నటించడం ఆయనకు అలవాటే కదా అంటారా?

అయితే ఇక్కడో విషయం ఉంది. ఆయన కనిపించింది మున్నాభాయ్‌ గెటప్‌లో. సంజూ బాబా కెరీర్‌లో ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ ఎంత పెద్ద విజయం అందుకుందో తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ గెటప్‌లో ‘డుంకీ’ సినిమాలో ఎందుకు కనిపిస్తాడు అనేది ప్రశ్న. ‘మున్నాభాయ్‌..’ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీనే ఇప్పుడు ‘డుంకీ’ తీస్తున్నారు. కాబట్టి ఓ పాత్ర కోసం అలా చేయించారు అనే టాక్‌ నడుస్తోంది.

అయితే కొంతమంది మాత్రం రాజ్‌కుమార్‌ హిరానీ ఏమన్నా సినిమాటిక్‌ యూనివర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారా అనే కాఎమంట్స్‌ చేస్తున్నారు. సౌత్‌లో ఇప్పుడు ఇదో ట్రెండ్. దానినే హిందీకి తీసుకెళ్తున్నారేమో అని డౌట్‌. మరికొందరైతే ఏకంగా మూడో ‘మున్నాభాయ్‌..’ వస్తున్నాడేమో అని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై హిరానీ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. బాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుడిగా హిరానీకి పేరుంది. మరి ఈ సినిమా ఫలితం అలాగే వస్తే షారుఖ్‌కి హ్యాట్రిక్‌ విజయం దక్కుతుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus