ఈ మధ్య కొంతమంది స్టార్ హీరోల సినిమాలకి కూడా సరైన బిజినెస్ జరగడం లేదు. దానికి కారణం ఆ ప్రాజెక్టులపై బజ్ లేకపోవడమే అని చెప్పాలి. బజ్ క్రియేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. గ్లిమ్ప్స్ లేదా టీజర్ క్లిక్ అయితే బజ్ వస్తుంది. లేదు అంటే పాటలు లేదా ట్రైలర్ బాగుంది అంటే బజ్ పెరగొచ్చు. ఇవేమీ కాదు అంటే కాంబినేషనల్ క్రేజ్ ను బట్టి కూడా బజ్ క్రియేట్ అవుతుంది.
ఉదాహరణకి ‘గుంటూరు కారం’ సినిమా విషయానికి వస్తే.. దానికి మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ క్రేజ్ ఉంది. దాని వల్ల ప్రమోషన్ పెద్దగా చేయకపోయినా.. మిక్స్డ్ టాక్ వచ్చినా దానితో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వచ్చాయి. అలాగే ‘ఓజి’ని తీసుకుంటే.. గ్లిమ్ప్స్ వల్ల దానికి భీభత్సమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవల వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాని తీసుకుంటే దాని పాటలు హిట్ అవ్వడం వల్ల బజ్ క్రియేట్ అయ్యింది.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘స్పిరిట్’ కి కాంబినేషన్ క్రేజ్ కారణంగా బిజినెస్ భారీగా జరుగుతుంది. బజ్ లేదు కాబట్టి ‘రాజాసాబ్’ ‘ఫౌజి’ సినిమాలకి బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు.అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాకి భారీగా బిజినెస్ జరుగుతుంది. దానికి కారణం కాంబినేషన్ క్రేజ్ అనే చెప్పాలి. ఆ సినిమా మరేదో కాదు ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పెద్ద హిట్టు.
అందుకే వాళ్ళ కాంబోలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) కి భారీగా థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. పైగా ఫస్ట్ సింగిల్ కూడా చార్ట్ బస్టర్ అయ్యింది. దీంతో హైప్ ఇంకా పెరిగింది. ‘ఓజి’ సినిమా రూ.160 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఏకంగా రూ.185 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.