ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన కూతురు సుస్మిత గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. బిడ్డల టాలెంట్ ను పెద్దలు ఎంకరేజ్ చేయాలనీ, కష్టపడితే మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ పరిశ్రమ ఉంటుందని.. ఇక్కడ ఎటువంటి క్యాస్టింగ్ కౌచ్ వంటివి లేవని, ఇక్కడ మీరు బలంగా ఉంటే.. మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు అంటూ చిరు చెప్పుకొచ్చారు.
ఆయన వ్యాఖ్యలను గాయని చిన్మయి తప్పుబడుతూ పరోక్షంగా ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చింది.’సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురయ్యే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. కమిట్మెంట్ పేరుతో లైంగిక ప్రయోజనాలు ఆశించే వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. పవర్ డైనమిక్స్ వల్ల కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు వేధింపులకు గురవుతున్నారు’ అంటూ చిన్మయి కామెంట్లు చేశారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని ఇప్పటికే చాలా మంది నటీమణులు చెప్పుకొచ్చారు. అందులో నిజం లేకపోలేదు. స్టార్ హీరోల కూతుర్లు ఎక్కువ శాతం హీరోయిన్లు కారు. వాళ్ళని నటులుగా నిలబెట్టడానికి స్టార్లు ఆసక్తి చూపించరు. ఎందుకంటే పరిశ్రమ గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉంది. ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో స్టార్స్ కి ఒక అవగాహన ఉంటుంది.
సో చిరు చెప్పినంత మాత్రాన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అనడం కరెక్ట్ కాదు. అదే విధంగా ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితి లేకపోలేదు. షార్ట్ కట్లో పైకి రావాలనుకునే ఎంతోమంది ఈ రూటుని ఎంపిక చేసుకుంటున్న అమ్మాయిలు కూడా లేకపోలేరు. ఇది కూడా చిన్మయి గ్రహించాలి.