“అల వైకుంఠపురములో” సినిమా సాధిస్తున్న విజయంలో కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ లది ఎంత కీలకపాత్రో.. వాల్మీకి పాత్ర పోషించిన మురళీశర్మ కూడా అదే స్థాయి కీలకపాత్ర పోషించాడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్యారెక్టర్లో చూపిన వేరియేషన్స్ తో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అటువంటి మురళీశర్మ సినిమా సక్సెస్ మీట్స్ & సెలబ్రేషన్స్ లో మాత్రం కనిపించడం లేదు. బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి.. వేరే సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు అందరూ.
కానీ.. ఇవాళ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసిన కథనం ప్రకారం మురళీశర్మకు సరైన రెమ్యూనరేషన్ లభించలేదని, 50 రోజుల డేట్స్ కి ఒప్పుకున్న తర్వాత 80 రోజులపాటు షూటింగ్ చేయించుకొని ముందు మాట్లాడుకున్న 50 రోజుల ఎమౌంట్ మాత్రమే ఇచ్చారని, అందుకే మురళీశర్మ అలిగి సినిమా సక్సెస్ మీట్స్ & సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటున్నాడని ఒక ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది. దాంతో 100 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన సినిమాకి పని చేసిన నటుడికి మంచి రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం ఏమిటి అని చర్చలు మొదలయ్యాయి. మరి ఈ కథనంలో నిజమెంతో తెలియాలంటే మురళీశర్మ స్పందించాలి.
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!