మహేష్ మూవీలోనూ ఆ విషయం వదలని మురుగదాస్

కమర్షియల్ డైరక్టర్ గా పేరుతెచ్చుకున్నప్పటికీ మురుగదాస్ తన సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ని మిళితం చేస్తుంటారు. అందుకే ఆ కథ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని ఎలా తగ్గించాలో అంటూ “రమణ” మూవీలో చూపించారు. ఆ పాయింట్ నచ్చి ఆ చిత్రాన్ని చిరంజీవి ఠాగూర్ గా తీశారు. ఇక రైతుల బాగు కోరాలనే అంశంతో రూపొందించిన కత్తి సూపర్ హిట్ అయింది. మంచి మెసేజ్ ఉందని ఆ కథనే ఖైదీ నంబర్ 150 గా తెలుగువారికి మెగాస్టార్ పరిచయం చేశారు. ఇక్కడ కూడా మురుగదాస్ స్టోరీకి విజయాన్ని అందించారు.

ఇప్పుడు ఏకకాలంలో తెలుగు, తమిళంలో మహేష్ బాబుతో సినిమాని రూపొందిస్తున్నారు. దాదాపు 90 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గురించి ఒక విష్యం కూడా బయటికి రాలేదు. కనీసం టైటిల్ ని కూడా డైరక్టర్ రివీల్ చేయలేదు. అయితే ఈ మూవీలోను ఓ అద్భుతమైన మెసేజ్ ఉంటుందని తెలిసింది. పూర్తిగా కమర్షియల్ హంగులు నింపుకున్న ఈ చిత్రంలో కథానాయకుడు (మహేష్) సమాజం బాగుకోసం పాటుపడుతారని సమాచారం. ఆ అంశం ఏమై ఉంటుందని ప్రిన్స్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఠాగూర్ మధు, ఎం వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 23న థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus