అక్కినేని నాగార్జున హీరోగా ‘అల్లరి’ నరేష్, రాజ్ తరుణ్..లు కీలక పాత్రల్లో ‘నా సామిరంగ’ అనే మూవీ రూపొందుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతూ చేస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కీరవాణి పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అవి మీకోసం :
ప్ర) ఆస్కార్ వచ్చిన తర్వాత ‘నా సామిరంగా’ సినిమాకి పని చేయడం వెనుక ఉన్న కారణం?
కీరవాణి : రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నాగార్జున గారితో నాకు ఉన్న అనుబంధం. రెండు డబ్బులు(నవ్వుతూ)
ప్ర) ఈ మధ్య కాలంలో మీరు సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.
కీరవాణి : మొదటి నుండి నేను సెలక్టివ్ గానే సినిమాలు చేస్తున్నాను. సినిమాకి సంగీతం బలం చేకూరుస్తుంది అనిపించే కథలు నేను ఎంపిక చేసుకుంటున్నాను.
ప్ర) ‘నా సామి రంగ’ కి మీ ఆస్కార్ ఇమేజ్ హైప్ తీసుకొస్తుంది అనుకోవచ్చా?
కీరవాణి : ఒక సినిమాకి హైప్ అనేది రిలీజ్ అయ్యే పాటల ద్వారా వస్తుంది. ఆస్కార్ అనేది ఒక సినిమా సక్సెస్ కి కొంచెం కూడా పనిచేయదని నేను భావిస్తాను. నా వరకు బాగా వర్క్ చేయాలి. డైరెక్టర్ బాగా తీయాలి. అది జనాలకి కనెక్ట్ కావాలి.
ప్ర) ఇందులో మీరు ఒక పాట రాయడం కూడా జరిగిందట?
కీరవాణి : వాస్తవానికి ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ చంద్రబోస్ గారే. రీరికార్డింగ్ చేసినప్పుడు ఒక సందర్భం పుడుతుంది. అలాంటి సందర్భంలో నుంచి ఆలోచన వస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఓ పాట రాశాను. అవసరమైతేనే రాస్తాను. ‘మర్యాద రామన్న’ లో కూడా ‘ఎన్నేళ్ళకు పెద్ద పండగ వచ్చే’ అనే పాట మొదట స్క్రిప్ట్ లో భాగంగా అనుకున్నది కాదు. తర్వాత నాకు (MM Keeravaani) అనిపించి యాడ్ చేశాను. ఇందులో కూడా అంతే..!
ప్ర) అంటే స్క్రిప్ట్ విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారా?
కీరవాణి : అలాంటి ఇంప్రొవైజేషన్లు ఉంటే చేస్తాను తప్ప స్క్రిప్ట్ లో నేను ఇన్వాల్వ్ అవ్వను.
ప్ర) కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ గురించి చెప్పండి?
కీరవాణి : అతను చాలా ఫాస్ట్. ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటాడు. క్వాలిటీ తగ్గకుండా 3 నెలల్లో ఈ సినిమాని తీయగలిగాడు. తర్వాతి సినిమాలు ఎలా తీస్తాడో నాకు తెలీదు. ఈ సినిమా వరకు అతను చాలా ఫాస్ట్ గా తీశాడు. డాన్స్ మాస్టర్ కాబట్టి మంచి పాటలు ఉండాలని అతను మ్యూజిక్ విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టాడు.
ప్ర) ఈ మధ్య కాలంలో మ్యూజిక్ పరంగా మీకు నచ్చిన చిత్రాలు ?
కీరవాణి : ‘యానిమల్’ మ్యూజిక్ బాగుంది. ‘జైలర్’ నేపధ్య సంగీతం నచ్చింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి మెసేజ్ కూడా చేశాను.
ప్ర) ‘నా సామి రంగ’ నిర్మాతల గురించి చెప్పండి?
కీరవాణి : చాలా మంచి నిర్మాతలు. సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసి డబ్బులు బాగా వస్తే మాకు కూడా వాటా ఇస్తామన్నారు. దేనికి లోటు చేయలేదు(నవ్వుతూ)
ప్ర) రాజమౌళి- మహేష్ బాబు సినిమా వర్క్ ఎప్పుడు నుంచి ఉంటుంది ?
కీరవాణి : అది రాజమౌళిని అడగాలి. ఫోన్ చేసి కనుక్కుందామని అనుకుంటుంటే అది స్విచాఫ్ లో ఉంటుంది.(నవ్వుతూ)
ప్ర) హరిహర వీరమల్లు ప్రోగ్రెస్ ఏంటి?
కీరవాణి : 3 పాటలు కంప్లీట్ చేశాను.
ప్ర) చిరంజీవి గారి సినిమా వర్క్ ఎంతవరకు వచ్చింది.!
కీరవాణి : చిరంజీవి గారి లేని పోర్షన్ షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!