మెలోడీ మయం.. బొమ్మల రామారం

  • August 10, 2016 / 09:50 AM IST

నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కొత్త వారితో తీసిన “బొమ్మల రామారం” చిత్రానికి పాటలు ప్రాణం కానుంది. ఇందులో ఐదు పాటల్లో సాహిత్యం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సాగుతూ కథా గమనానికి తోడుకానున్నాయి. ఈ పాటలన్నీ గాయనీమణులు పాడడం ఒక విశేషమయితే.. చిత్రీకరణలో బ్యాగ్రౌండ్ లో రావడం మరో విశేషం. అంతా మాంటేజ్ విధానంలో, భావాన్నీ వ్యక్తీకరించడానికి మాత్రమే పాటలను వినియోగించుకుని డైరక్టర్ నిశాంత్ కొత్త ఒరవడి సృష్టించారు. కార్తిక్ కొడకండ్ల స్వరపరిచిన ఈ గీతాలను ప్రముఖ గాయని సుశీలమ్మ రిలీజ్ చేయాగా.. ఇవి నేటి యువత మనసుకు హత్తుకుంటున్నాయి.

1. బొమ్మల రామారం

సూర్యుడు తెచ్చే పొద్దెల్లె ఉండే బొమ్మల రామారం.. అంటూ బొమ్మల రామారం ఊరి గురించి టైటిల్ సాంగ్ లో అందంగా చెప్పారు. నూతన రచయిత సుహాసిని రాసిన ఈ పాటను ప్రముఖ గాయని సుశీలమ్మ పాడారు. ఆమె దగ్గరుండి సినిమా లోకి తీసుకెళ్లినట్టుగా ఈ పాట ఉంటుంది.

2. నా కంటి చూపు

అడవిలో అనందం వేసినపుడు నెమలి పురివిప్పి ఆడినట్లు.. అమాయకత్వం మూటకట్టుకున్న ఓ యువతీ సంతోషాన్ని మెలోడీ రూపంలో మనకి ఇచ్చారు కార్తిక్. రామన్ , శ్రీమన్ సాహిత్యం అందించగా స్వాతి పాడిన తీరు మనసును మీటుతుంది. ముఖ్యంగా ఈ సాంగ్ అమ్మాయిలకు ఫెవరెట్ గా నిలిచింది.

3. ఏదో తెలియని దిగులు

https://www.youtube.com/watch?v=c1960QpKkuc

సుహాసిని రాసిన మరో అద్భుతమైన పాట “ఏదో తెలియని దిగులు”. ఇందులో ప్రేమలో పడిన అమ్మాయికి కలిగే భావాలను ఆమె చాలా సున్నితంగా పేపర్ మీద పెట్టారు. “వయసే ఊహల్లో ఉయ్యాలా ఊగింది ..” అనే పద ప్రయోగాలు కొత్త అనుభూతిని ఇచ్చాయి. మానస ఆచార్య ఆలపించిన ఈ పాట ఆహ్లాదకరంగా సాగింది.
ఈ ఆల్బంలో “ఏదో తెలియని దిగులు” ఎక్కువ ప్రశంసలు అందుకుంటోంది.

4. “ఆ కళ్ల తోని …”

https://www.youtube.com/watch?v=GlDtUECH90Y

అమ్మాయి, అబ్బాయి మధ్య స్వచ్ఛమైన ప్రేమ చిగురించే క్షణాలు అపురూపం. వర్ణించడం చాలా కష్టం. కానీ సహజమైన వాఖ్యాలతో “ఆ కళ్ల తోని …” పాటతో హాయిగా చెప్పారు. అరవింద్ రామా ఎక్కడినుంచి ఏరుకొచ్చారో గాని ఆణిముత్యాల్లాంటి లిరిక్స్ సమకూర్చారు. ” చిన్నదాని వలపే.. అరే చిత్రమైన తలపే.. చినుకు చినుకు మల్లె నీ సిగను తాకనే ” అనే సాహిత్యం “నూతన” గొంతుతో వింటుంటే ఎవరైనా ఈ పాటతో ప్రేమలో పాడడం ఖాయం.

5 . మనసు చెదిరి మోడై ఉన్న ..

మనలోని ఆవేశం ఉబికి వస్తే .. అరుపులు వినిపిస్తాయి. చిత్రాల్లో అయితే పెద్ద హోరుతో పాటలను స్వరపరుస్తారు. కానీ కార్తీక్ సీరియస్ సన్నివేశంలో కూడా మెలొడితో భావాన్ని ప్రేక్షకుడికి చేరవేయ వచ్చని “మనసు చెదిరి మోడై ఉన్న ..” పాటతో నిరూపించారు. ఇందులో డైరక్టర్ నిశాంత్ ఎంచుకున్న థీమ్ స్పష్టంగా తెలుస్తుంది. సుహాసిని రాసిన ఈ పాటను ప్రణవి చక్కగా పాడారు.

మనలోని ఆవేశం ఉబికి వస్తే .. అరుపులు వినిపిస్తాయి. చిత్రాల్లో అయితే పెద్ద హోరుతో పాటలను స్వరపరుస్తారు. కానీ కార్తీక్ సీరియస్ సన్నివేశంలో కూడా మెలొడితో భావాన్ని ప్రేక్షకుడికి చేరవేయ వచ్చని “మనసు చెదిరి మోడై ఉన్న ..” పాటతో నిరూపించారు. ఇందులో డైరక్టర్ నిశాంత్ ఎంచుకున్న థీమ్ స్పష్టంగా తెలుస్తుంది. సుహాసిని రాసిన ఈ పాటను ప్రణవి చక్కగా పాడారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus