నా పేరు సూర్య‌ మూవీ థియేట్రికల్ ట్రైలర్ | అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు ఏ స‌ర్టిఫికేట్ తో మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ….. మా చిత్రం నాపేరు సూర్య- నా ఇల్లు ఇండియా చిత్రానికి మెద‌టినుండి పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. ప్ర‌తి భార‌తీయుడు ఇది నా చిత్రం అని కాల‌ర్ ఎత్తుకుని చెప్పె చిత్రం గా ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో నిలుస్తుంది. బ‌న్ని ఫెర్‌పార్మెన్స్ త‌న కెరీర్ లో బెస్ట్ అని గ‌ర్వంగా చెబుతున్నాను. అలాగే స‌ర్‌ప్రైజ్ డాన్స్ లు కూడా వుంటాయి. ఈ చిత్రంలో ఇలాంటి ఎన్నో స‌ర్‌ప్రైజ్ లు వున్నాయి…అని అన్నారు

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus