ఏడు భాషల్లో రిలీజ్ కానున్న ‘నా పేరు సూర్య’

  • January 22, 2018 / 08:26 AM IST

బాహుబలి తర్వాత తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో క్రేజ్ పెరిగింది. అందుకే తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ముందు నుంచే నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఒక అడుగు ముందుకు వేశారు. తన సినిమాని ఏడు భాషల్లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దువ్వాడ జగన్నాథం తర్వాత బన్నీ.. వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” అనే చిత్రాన్ని చేస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ కి మంచి స్పందన వచ్చింది. అందుకే 24 కోట్లకి “నా పేరు సూర్య” శాటిలైట్ రైట్స్ (తెలుగు, హిందీ (డబ్బింగ్) ను జీ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది. అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల తర్వాత తమిళనాడులో, కేరళలో ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తన నటనతో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లలో అభిమానులను సంపాదించుకోనున్నారు. ప్రతి భారతీయుడు కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కుతోన్న నా పేరు సూర్య సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus