Nag Ashwin: నాగ్ అశ్విన్.. కల్కి 2 కంటే ముందే మరో సర్ ప్రైజ్?

Ad not loaded.

‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD)  విజయం తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్  (Nag Ashwin)  తదుపరి ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ సినిమా క్లైమాక్స్ చూసినవారంతా సీక్వెల్ కోసం ఎదురుచూస్తుండగా, ‘కల్కి 2’ ఇప్పుడే రాదని నాగ్ అశ్విన్ స్పష్టంగా చెప్పాడు. ఆయన మాటల్లోనే ‘అది రెండు మూడు సినిమాల రేంజ్‌లో ఉండబోతోంది’ అంటే, ప్రాజెక్ట్ భారీగా ఉంటుందని అర్థం. కానీ ఆ సినిమా మొదలయ్యే లోపు నాగ్ మరో కొత్త ప్రయత్నం చేయబోతున్నాడనే టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

Nag Ashwin

ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) చేతిలో ‘రాజాసాబ్’ (The Rajasaab), ‘పౌజీ’, ‘సలార్ 2’ (Salaar), ‘స్పిరిట్’ (Spirit)  లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని అంచనా. ఈ లాంగ్ గ్యాప్‌లో నాగ్ అశ్విన్ ఖాళీగా ఉండటం ఇష్టం లేక, ఓ చిన్న సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఉండబోతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని టాక్. ఇప్పటికే నాగ్ అశ్విన్ తన ఐడియాను దిల్ రాజుతో పంచుకున్నాడని, రాజు వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. ‘కల్కి 2’ కోసం ఎంత సమయం పట్టినా ఎటువంటి హడావుడి లేకుండా ఆ సినిమా మెజస్టిక్ స్కేల్‌లో చేయాలని నాగ్ భావిస్తున్నాడు. కానీ ప్రేక్షకులతో టచ్‌లో ఉండేందుకు చిన్న సినిమా చేయడమే బెటర్ అని ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు.

ఇప్పటికే నాగ్ అశ్విన్ ‘ఏవడే సుబ్రమణ్యం’ (Yevade Subramanyam), ‘మహానటి’ (Mahanati) లాంటి విభిన్నమైన సినిమాలతో తన ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్‌ను చూపించాడు. ఇప్పుడు అదే తరహాలో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడని టాక్. మరి, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus