Nag Ashwin: ‘పుష్ప’ స్టైల్‌ను ‘కల్కి’ ఫాలో అవుతుందా? నాగీ మాటలకు అర్థం అదేనా?

‘పుష్ప’ (Pushpa) సినిమా వచ్చి సుమారు మూడేళ్లు అవుతోంది. అప్పటికే రెండో పార్టు సినిమా షూటింగ్‌ కొంత అయింది అని అన్నారు కూడా. అయినా ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తవలేదు. దీంతో సినిమా కూడా రిలీజ్‌ కావడం లేదు. ఇప్పుడేదో డేట్‌ చెప్పారు కానీ.. ఆ రోజుకు పనులు అవుతాయా అనేది చర్చ కూడా సాగుతోంది. ఆ విషయం పక్కనపెడితే అప్పుడు దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెలుసుకున్న విషయాల్ని, ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)  దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  (Nag Ashwin) తెలుసుకున్నారా?

ఏమో ఇటీవల కాలంలో ఇంకా చెప్పాలంటే సినిమా ప్రచారం జరిగినన్నల్లూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాని ఆయన తొలిసారి వచ్చారు. సినిమా కోసం సెట్స్‌ వేసిన ప్రాంతంలో తెలుగు మీడియాతో తొలిసారి మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా గురించి కీలక విషయాలు చెప్పడంతోపాటు, ఉన్న డౌట్స్‌ను క్లియర్‌ చేసేశారు. ఈ క్రమంలో కొన్ని కొత్త డౌట్స్‌ వచ్చాయి అనుకోండి. అయితే ఆయన మాటలు వింటుంటే సుకుమార్‌లా ఈయనకు కూడా క్లారిటీ వచ్చింది అనిపిస్తోంది.

సినిమా ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకొని ఆ తర్వాతి సినిమా కోసం వాడటం మన దర్శకులకు అలవాటు. గతంలో చాలామంది దర్శకులు చేశారు. అయితే ఫ్రాంచైజీలు, సినిమాటిక్‌ యూనివర్స్‌లు, సీక్వెల్స్‌ చేసే దర్శకులు అయితే ఈ పని కచ్చితంగా చేయాలి. నాగీ మాటలు వింటుంటే ఆయన కూడా చాలా ఇన్‌పుట్స్‌, ఫీడ్‌ బ్యాక్స్ తీసుకున్నారు అనిపిస్తోంది. వాటిని సెకండ్‌ పార్ట్‌లో (వీలైనంతవరకు ఆఖరి పార్ట్‌) పెడతారు అని అనిపిస్తోంది.

‘కల్కి 2898 ఏడీ’ తొలి పార్టు కథలో కొన్ని లూప్‌ హోల్స్‌ ఉన్నాయి. మరికొన్ని చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా ఆపేశారు. కొన్ని పాత్రలను మధ్యలోనే ఆపేశారు. ఇవి కాకుండా సాంకేతికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. త్రీడీ వెర్షన్‌ చాలా నాసిరకంగా ఉంది. తొలి అర్ధ భాగం ఓకే అనిపించుకున్నా.. సెకండాఫ్‌ నిరాశపరిచింది. ఇక నేపథ్య సంగీతం అయితే సరేసరి. ఇవన్నీ నాగీ కరెక్ట్‌ చేసుకుని ఎప్పుడు రెండో పార్టు షురూ చేస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus