సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమా యుగపురుషుడు లోని ఒక డైలాగ్ ను ఇటీవల వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమాలో పెట్టారు. రిలీజ్ కి ముందు అదే డైలాగ్ ను కొంచెం డబుల్ మీనింగ్ గా సోషల్ మీడియాలో వాడటం మనం చూశాం. ఆ డైలాగ్ సడన్ గా సినిమాలో కనిపించడంతో కొందరు సర్ప్రైజ్ అయ్యారు, ఇంకొందరు షాక్ కు గురయ్యారు. నాలుగు రోజులుగా ట్రెండ్ అవుతున్న ఒక డైలాగ్ ను ఒక కొత్త సినిమాలో ఎలా పెట్టారు. ప్రీమియర్ షోలకే అది ఎలా సాధ్యమైంది.? ఇలాంటి ప్రశ్నలు చాలా చర్చలకి దారి తీశాయి. అవి ఏ రేంజ్ కి వెళ్ళాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ కాంట్రవర్సీ వేడి ఇంకా తగ్గక ముందే సీనియర్ ఎన్టీఆర్ టాపిక్ మరో సీనియర్ నిర్మాత తీయడం .. ఇంకో చర్చకు దారితీసినట్టు అయ్యింది.
విషయం ఏంటంటే.. సీనియర్ స్టార్ నిర్మాత ఎం ఎస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ సినిమా ఈ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎం ఎస్ రాజు ‘ నేను కూడా సీనియర్ ఎన్టీఆర్ గారిలా ఉదయం 3 గంటలకి అంటే బ్రహ్మ ముహూర్తాన లేచి ఆయనలా చికెన్ తినలేదు కానీ పాలు తాగి అగధ సినిమా కోసం కష్టపడ్డాను. ‘ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా కొందరు పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి ఎం ఎస్ రాజు మరింత స్టఫ్ ఇచ్చినట్టు అయ్యింది.
ఇంకొందరు అయితే ఎం ఎస్ రాజుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ అంశంపై ఎం ఎస్ రాజు స్పందించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయం 3 గంటలకి లేచి కష్టపడిన రోజులు తాను దగ్గరుండి చూశానని, గార్డెన్ లో చాలా పనులు చేశాక.. వెళ్ళి స్నానం చేసి వచ్చి బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చికెన్ తినేవారని ఎం ఎస్ రాజు తెలిపారు. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని అగధ సినిమా కోసం కష్టపడి చేశాను అని చెప్పడమే తన ముఖ్య ఉద్దేశం అని ఎం ఎస్ రాజు తెలిపారు. ఈ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ తనని ట్రోల్ చేయదు అంటూ చమత్కరించారు ఎం ఎస్ రాజు.