Naga Chaitanya, Nikhil: స్పై గురించి నాగ చైతన్య ఆసక్తికర కామెంట్లు!

నిఖిల్ నటించిన స్పై మూవీ జూన్ 29 న రిలీజ్ కాబోతుంది. గ్యారీ బి హెచ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లలో భాగంగా ఈరోజు , హైదరాబాద్ లో ఉన్న వెస్టిన్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. దీనికి ముఖ్య అతిథిగా నాగ చైతన్య విచ్చేసి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘ అందరికీ నమస్కారం.

మీ హీరో( నిఖిల్) సినిమాలు అంటే నాకు కూడా ఇష్టం. హ్యాపీ డేస్ వంటి క్లాస్ మూవీతో లాంచ్ అయ్యి స్వామి రారా, కార్తికేయ , కార్తికేయ 2 వంటి సూపర్ హిట్లు ఇచ్చాడు. కార్తికేయ 2 తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.ఇప్పుడు స్పై తో వస్తున్నాడు.స్పై ట్రైలర్ చూసాను నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడతాడు అనే నమ్మకం నాకు ఉంది.

తేజ్, రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి నిర్మాతలు. ఐశ్వర్య మీనన్ , సన్య .. వెల్కమ్ టు టాలీవుడ్. అభినవ్.. నాకు బోర్ కొట్టినప్పుడల్లా.. ఈ నగరానికి ఏమైంది సినిమాలో మీ కామెడీ సీన్స్ చూస్తుంటాను. మీతో కలిసి పనిచేయాలని ఎంతో ఆసక్తితో ఉన్నాను. డైరెక్టర్ గ్యారీ .. ఇప్పటివరకు ఎడిటర్ గా మాకు చాలా సినిమాలు అందించారు.

డైరెక్టర్ గా .. ఎన్నో మంచి సినిమాలు మాకు అందిస్తారని కోరుకుంటున్నాను. జూన్ 29 న స్పై మూవీని థియేటర్లలో మిస్ కాకుండా చూడండి. టీమ్ అందరికీ మరొక్కసారి నా బెస్ట్ విషెస్ చెబుతున్నాను.’ అంటూ చెప్పుకొచ్చాడు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus