Naga Chaitanya, Samanth: హెడ్ లైన్స్ కోసం సాగ తీయడం తప్పు: నాగచైతన్య

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు అవుతుంది.ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు అయినప్పటికీ వీరి విడాకుల గురించి తరచూ ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. నాగచైతన్య సమంత విడాకుల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య తన విడాకులకు గల కారణాలు తెలిపారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని ఆ గొడవలు పెరిగి పెద్దవి కావడంతోనే విడాకులు తీసుకున్నామంటూ క్లారిటీ ఇచ్చారు.ఇలా నాగచైతన్య చేసిన వ్యాఖ్యలపై సమంత కామెంట్స్ చేస్తూ మనమంతా ఒకటే కేవలం అహంకారం భయం అనేది మనల్ని దూరం చేస్తాయి అంటూ తిరిగి కామెంట్స్ చేశారు. ఇలా వీరిద్దరూ తమ విడాకుల గురించి వారి అభిప్రాయాలను తెలియజేశారు.

అయితే తాజాగా మరోసారి నాగచైతన్య (Naga Chaitanya) తన విడాకుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను సమంత ఇద్దరం ఒకేసారి డివోర్స్ అనౌన్స్ చేసాము. అయినప్పటికీ హెడ్ లైన్స్ కోసం మా విడాకులను మరింత సాగదీయడం మంచిది కాదని ఇది పూర్తిగా తప్పు అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా మరోసారి తన విడాకుల గురించి మాట్లాడారు.ఇక నాగచైతన్య తన సినిమాల గురించి మాట్లాడుతూ సినిమాలకు వచ్చే రివ్యూస్ కామెంట్స్ కూడా తాను చదువుతూ ఉంటానని తెలిపారు.

అయితే కొన్నిసార్లు ఆ కామెంట్స్ కనుక చూస్తే బ్రతకడం వేస్ట్ అనిపిస్తుందని నాగచైతన్య ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన నటించిన కస్టడీ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus