‘ఊపిరి’ ట్రైలర్‌ను విడుదల చేసిన నాగచైతన్య, అఖిల్‌

‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, ‘ఆవారా’ కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై ‘బ ందావనం’ ‘ఎవడు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఊపిరి’. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 10న ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య, యూత్‌ కింగ్‌ అక్కినేని అఖిల్‌ ‘ఊపిరి’ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అనంతరం ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో యువసామ్రాట్‌ నాగచైతన్య, యూత్‌ కింగ్‌ అఖిల్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి, రచయితలు అబ్బూరి రవి, హరి పాల్గొన్నారు.
ట్రైలర్‌ చూస్తుంటే ఎమోషనల్‌గా అనిపించింది
యువసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ – ”ట్రైలర్‌ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉంది. అలాగే నాన్నగారు యంగ్‌ అయిపోతున్నారు. మేం ఓల్డ్‌ అయిపోతున్నామనే ఆలోచన వచ్చేస్తుంది. మాస్‌ సినిమాలు చేసే వంశీ డిఫరెంట్‌ మూవీస్‌ చేస్తున్నాడు. తను చేసిన మరో కొత్త ప్రయత్నమే ఈ సినిమా. ఇలాంటి సినిమా చేయాలంటే పివిపిగారి లాంటి నిర్మాతే సరైన వ్యక్తి. ట్రైలర్‌ చూస్తుంటే వారు పడిన కష్టమంతా కనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.
‘ఊపిరి’ ట్రైలర్‌ చూశాక మా నాన్నే మా ఊపిరి అనిపించింది
యూత్‌కింగ్‌ అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ – ”ఫస్ట్‌ ఈ కథ విన్నపుడు నాన్నగారి క్యారెక్టర్‌ ఛెయిర్‌లో కూర్చోవడం ఏమిటి? చేయవద్దు అన్నాను. ఫుల్‌ స్క్రిప్ట్‌ అంతా విన్నాక చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఇలాంటి మంచి సినిమాని నాన్నగారితో చేసిన వంశీకి థాంక్స్‌. ట్రైలర్‌ చాలా బాగుంది. ట్రైలర్‌ చూశాక మా నాన్నే మా ‘ఊపిరి’ అనిపించింది. ఈ చిత్ర టీమ్‌ మొత్తం రెండు సంవత్సరాలుగా చేసిన ఎమోషనల్‌ జర్నీ. ట్రైలర్‌ చూస్తుంటే ఆ డెప్త్‌ తెలుస్తుంది. వంశీ సినిమాను బ్యూటిఫుల్‌గా తెరకెక్కించాడు. అలాగే ‘మనం’ సినిమాకు బ్యాక్‌ బోన్‌గా నిలిచిన పి.ఎస్‌. వినోద్‌ ఈ చిత్రానికి బ్యాక్‌ బోన్‌గా నిలిచాడు. సినిమాలో హై స్టాండర్డ్‌ విజువల్స్‌ కనపడుతున్నాయి. అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు నాన్నగారికి కార్తీ అంటే విపరీతమైన ప్రేమ… వంశీకి వినోద్‌ అంటే ప్రేమ. వీరందరి కలయికలో వస్తున్న ఎమోషనల్‌ జర్నీయే ఈ సినిమా. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
ప్రముఖ నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ – ”ఈ సినిమాను మార్చి 2014లో స్టార్ట్‌ చేశాం. ఇప్పటికి రెండేళ్ళయింది. కథ విషయంలో ఎంతో కేర్‌ తీసుకుని పక్కా స్క్రిప్ట్‌తో సెట్స్‌కెళ్లాం. సినిమా చాలా బాగా వచ్చింది. నాగార్జుగారికి వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ. మా బ్యానర్‌లో వన్‌ ఆఫ్‌ ది ఫైనెస్ట్‌ మూవీ అవుతుంది. తెలుగు, తమిళంలో కలిపి 60 కోట్ల ఖర్చుతో చాలా గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. పారిస్‌, బెల్జియం వంటి దేశాల్లో సినిమాను షూట్‌ చేశాం. వరల్డ్‌ క్లాస్‌ టెక్నీషియన్స్‌ అంతా ఈ సినిమాకి వర్క్‌ చేశారు. మాస్‌ డైరెక్టర్‌ వంశీ చాలా క్లాస్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. పి.ఎస్‌. వినోద్‌ గారి విజువల్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.
చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ”మేం చేసిన కొత్త ప్రయత్నమే ఈ చిత్రం. నాగార్జునగారు, కార్తీగారు, పివిపి అన్న నమ్మకమే ఈ ‘ఊపిరి’. ఇలాంటి విజువల్స్‌ ఉన్న సినిమా చేయాలంటే గట్స్‌ ఉన్న నిర్మాత కావాలి. అది పివిపిగారికే సాధ్యమైంది. పారిస్‌ లాంటి కాస్ట్‌ లీ సిటీలో 12 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. చాలా కొత్తగా చూపించాం. అందరికీ మెమొరబుల్‌ జర్నీ. సమ్మర్‌లో విడుదలవుతున్న తొలి సినిమా. బ్రీత్‌ ఆఫ్‌ రిలీఫ్‌. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్‌ చేస్తున్నాం” అన్నారు.

మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ – ”అప్పుడప్పుడు బాధపెడుతూ, మనసు మెళిక పెడుతూ కన్నీళ్ళు వచ్చేస్తాయనుకునే లోపు నవ్వించే సినిమా ఇది. తప్పకుండా అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తుంది” అన్నారు.
రచయిత హరి మాట్లాడుతూ – ”ఈ సినిమా ఓ ఎమోషనల్‌ జర్నీ. ప్రతి పాత్ర మనసుకు నచ్చేలా ఉంటుంది” అన్నారు.
కింగ్‌ నాగార్జున, ‘ఆవారా’ కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బ ంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి. పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus