చైతూ పెళ్లి అచ్చం ఆ సినిమాలోలానే…!

సినీ నటులకు సంబంధించిన ప్రతీ విషయానికి వార్తల్లో చోటు ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే వారు చేసే సినిమాల కంటే ఇవే ఎక్కువ. అదేకోవలో కొన్నాళ్ల క్రితం నాగచైతన్య-సమంత ప్రేమకథ వార్తా ప్రపంచంలో విహరించగా అక్కినేని కుటుంబం చెప్పిన పెళ్లి కబురుతో వాటికి తెరపడింది. అంటే పూర్తిగా కనుమరుగైందని కాదు. వార్తలోని మేటర్ మారింది. ప్రేమ కాస్త పెళ్లయింది.

ఇక తమ పెళ్లిపై నాగచైతన్య ఏమన్నాడంటే.. “ఏ మాయ చేశావే సినిమాలో లాగానే మా పెళ్లి ముందు చర్చిలో తర్వాత గుడిలో జరుగుతుందేమో. ఇంకా ఏం నిర్ణయించుకోలేదు. చెన్నైలోనా లేక హైదరాబాద్ లోనా అన్నది కూడా ఇంకా ఖరారు కాలేద”న్న చైతూ తమ్ముడి పెళ్లి కబుర్లు మాత్రం బాగానే చెప్పాడు. అఖిల్, శ్రేయల వివాహం ఇటలీలోని రోమ్ నగరంలో జరుగనుందట. వచ్చే ఏడాది మే లో ఉండొచ్చన్న చైతూ ప్రస్తుతం నిశ్చితార్థం సందడిలో అంతా మునిగి ఉన్నారని చెప్పుకొచ్చాడు. ‘తమ్ముడి పెళ్లి ముందు జరుగుతుండటం ఎలా అనిపిస్తోందన్న ప్రశ్నకు “చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి తనమీదే ఉండటం నేను సేఫ్” అంటూ దరహాసం చిందించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus