చైతు కొత్త బైక్ కొన్నాడు!
- July 12, 2016 / 12:51 PM ISTByFilmy Focus
అక్కినేని నాగచైతన్యకు కు బైక్స్ అంటే చాలా ఇష్టం. మార్కెట్ లోకి తనకు ఇష్టమైన బైక్ వస్తే కొనకుండా మాత్రం ఉండడు మన హీరో. ఈ నేపధ్యంలో రీసెంట్ గా ‘ట్రియూంప్’ అనే కంపనీ కొత్తగా మార్కెట్ లోకి ‘త్రక్స్ టన్ ఆర్’ అనే మోడల్ గల బైక్ ను లాంచ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న చైతు ఈ బైక్ కొనడానికి స్వయంగా తనే షోరూమ్ కి వెళ్ళాడు.
చైతు తమ షోరూమ్ కి రావడం ఎంతో ఆనందంగా ఉందని కంపనీ యాజమాన్యం తెలిపింది. చైతు కొన్న బైక్ ఖరీదు అక్షరాల 11 లక్షలు. బైక్ కొనుగోలు చేసిన వెంటనే చైతు దానిపై రైడ్ కు కూడా వెళ్ళాడు. ప్రస్తుతం చైతు నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కూడా చైతు బైక్ మీద ఎక్కువ సమయం ప్రయాణం చేస్తూ.. కనిపిస్తాడు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












