నాగార్జున వారసత్వం కేవలం నటనలో మాత్రమే కాదు.. వ్యాపార రంగంలోనూ అందిపుచ్చుకున్నాడు నాగచైతన్య. ముఖ్యంగా నాగార్జునకు ఎంతో ఇష్టమైన హోటల్స్ రంగంలోకి వచ్చారు. రెగ్యులర్ ఇండియన్ టైప్ ఫుడ్‌తో రెస్టరంట్‌లు నిర్వహించడం నాగార్జున స్టైల్ కాదు. అందుకే నాగచైతన్య కూడా అలాంటి ఆలోచనే చేసి జపాన్ స్టైల్ ఫుడ్‌ను హైదరాబాద్ ప్రజలకు అందించారు. ఇప్పటికే రెండు క్లౌడ్ కిచెన్‌లు ప్రారంభించిన చైతు రీసెంట్ తన ఫుడ్ బిజినెస్, నాగార్జున ఫుడ్ ఇంట్రెస్ట్‌ల గురించి చెప్పుకొచ్చారు.
జపనీస్ వంటకాలు నాకు నచ్చుతాయి. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా జపనీస్ వంటకాలు రుచి చూడటానికి ఇష్టపడతా. ఆ రుచి హైదరాబాద్ వాసులకు అందించాలనుకున్నాను. ఓపెన్ రెస్టారంట్‌గా ప్రారంభించాలని తొలుత అనుకున్నా.. కరోనా – లాక్‌డౌన్ పరిస్థితిని మార్చేసింది. అప్పుడు మార్కెట్‌లో క్లౌడ్ కిచెన్‌కు అవకాశం ఉందనిపించింది. అందుకే షోయూ అనే ఆలోచన చేశాను అని చెప్పాడు చైతు.
ఖాళీ సమయంలో ఇంట్లో కొత్త వంటకాలను ట్రై చేస్తుంటాను. శోభిత మొదట రుచి చూసి, ఫీడ్ బ్యాక్ ఇస్తుంది. దాని బట్టే మెనూ మార్పులు ఉంటాయి. ఇక నాన్నకు పీజాలు అంటే ఇష్టం. ఆదివారం స్కూజీ (చైతు రెండో క్లౌడ్ కిచెన్) నుండి కొత్తరకం పిజ్జాలు తెప్పించుకుని తింటారు అని చెప్పాడు చైతు. షోయూ పూర్తిగా జపాన్ స్టైల్ ఫుడ్ అయితే.. స్కూజీలో యురోపియన్, కాంటినెంటల్ స్టైల్ ఫుడ్ సర్వ్ చేస్తామని చైతు చెప్పాడు.
ఇక నాగచైతన్య సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇటీవల చైతు చెబుతూ చివరి 25 నిమిషాలు ప్రేక్షకుడిని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయన్నారు. మన దేశ సినిమా చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి అంశాలను చూడలేదని చెప్పాడు. అలాగే మరోసారి చై ఓటీటీలోకి రాబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘దూత 2’ వెబ్‌సిరీస్ చేస్తాడు. ప్రస్తుతం ఇది స్క్రిప్ట్‌లో దశలో ఉంది.