రీమేక్ కు ఓకే చెప్పిన యంగ్ హీరో!

  • August 2, 2016 / 07:23 AM IST

ఈ మధ్య కాలంలో తెలుగులో రీమేక్ చిత్రాలు ఎక్కువైపోయాయి. తమిళం, హిందీ భాషల్లో హిట్ అయిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కూడా ఓ రీమేక్ సినిమానే. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఓ రీమేక్ సినిమాలో నటించడానికి మక్కువ చూపుతున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో యంగ్ హీరో చేరుతున్నాడు.

అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య ప్రస్తుతం ‘ప్రేమమ్’,’సాహసం శ్వాసగా సాగిపో’ అనే రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తన తదుపరి సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘ఈట్టి’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా చైతు కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో డైరెక్ట్ చేసిన రవి అరుసు అనే దర్శకుడే తెలుగులో కూడా దర్శకత్వం వహించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus