టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాగచైతన్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. నాగచైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. అయితే దూత వెబ్ సిరీస్ తో నాగచైతన్య మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1వ తేదీ నుంచి దూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అక్కినేని హీరో కోరుకున్న విజయాన్ని ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాలి.
40 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. విక్రమ్ కె కుమార్ కు కూడా ఈ వెబ్ సిరీస్ సక్సెస్ కావడం కెరీర్ పరంగా కీలకమని చెప్పవచ్చు. ఒకప్పుడు వరుస విజయాలు సాధించిన విక్రమ్ కె కుమార్ ఇప్పుడు ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిలవుతున్నారు. విక్రమ్ కె కుమార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు. అక్కినేని హీరో నాగచైతన్య కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
నాగచైతన్య పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకుంటే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు. నాగచైతన్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. అక్కినేని హీరోల నుంచి మరో మల్టీస్టారర్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగచైతన్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే కెరీర్ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది.
నాగార్జున నా సామిరంగ సినిమాతో బిజీగా ఉండగా అఖిల్ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. నాగచైతన్య త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. నాగచైతన్య, సామ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే లేదని సమాచారం అందుతోంది.