పవర్ ఫుల్ పాత్రలో చైతూ…?

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో తెరెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ మొదలయ్యింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ప్రారంభమైంది. వెంకటేష్, చైతన్య ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబందించిన ఓ వీడియో కూడా లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ అలర్ట్ అయ్యింది.

ఈ చిత్రంలో వెంకటేష్ రైస్ మిల్లర్ ఓనర్ గా కనిపిస్తుండగా… చైతూ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతునున్నాడని సమాచారం. అయితే ఆర్మీలో కూడా చైతన్యతో కామెడీ చేస్తాడట. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బాబీ. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా… నాగ చైతన్య సరసన రాశిఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని ‘కోన ఫిలిం కార్పొరేషన్’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus