నాగ చైతన్య, సమంత వివాహ వేడుక సంగతులు!

టాలీవుడ్ ప్రేమ పక్షులు రెండో రోజుల్లో ఓ ఇంటివారు కాబోతున్నారు. అక్కినేని నాగచైతన్య, సమంతలు అక్టోబర్ 6 న భార్యాభర్తలు కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ పెళ్లి గోవాలో జరుగుతుందని ఇదివరకే చెప్పారు. తాజా సమాచారం ప్రకారం గోవాలోని వాగటర్ బీచ్ పక్కన గల  ‘W’ హోటల్ లో కల్యాణ మహోత్సం జరగనున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు వధూవరులకు అత్యంత సన్నిహితులు 150-200 మంది మాత్రమే హాజరవుతున్నారు. వారి కోసం  ‘W’ హోటల్ లోనే గదులను బుక్ చేశారు. ఇక కొంతమంది ప్రత్యేక గెస్ట్ లను  ఈరోజు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక విమానంలో నాగార్జున తీసుకుపోనున్నారు.

ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేస్తున్నప్పటికీ ఇందుకోసం దాదాపు 10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మొదట హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరుగుతుంది. అనంతరం చర్చిలో పెళ్లి చేసుకుంటారు.  ఈ జంట హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున అత్యంత వైభవంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus