వెంకటేష్ రెకమెండ్ చేసిన స్టోరీతో సినిమా చేస్తున్న నాగచైతన్య

ప్రేమమ్, రారండోయ్.. వేడుక చూద్దాం.. వంటి విజయాలతో అక్కినేని నాగ చైతన్య దూసుకుపోతున్నారు. ఇప్పుడు మరో ప్రాజక్ట్ ని పట్టాలెక్కించారు. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో యుద్ధం శరణం అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి క్యూరియాసిటీని పెంచింది. ఇందులో చైతూ పాత్ర ఎలా ఉంటుందో ? అని అభిమానుల్లో చర్చ మొదలయింది. వారికోసం తన పాత్ర గురించి నాగచైతన్య వివరించారు. “టైటిల్ కి తగినట్లుగానే ఇది ఒక యాక్షన్ మూవీ. ఈ చిత్రంలో కాలేజ్ డ్రాపవుట్ గా కనిపిస్తాను. యువతకు మెచ్చేలా ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాం” అని చెప్పారు.

స్టోరీ ఎంపికలో తండ్రి నాగార్జున సహాయం ఎప్పుడూ ఉంటుందని, అయితే ఈ సారి మామయ్య వెంకటేష్ తనకు ఈ స్క్రిప్ట్ రికమెండ్ చేశారని వెల్లడించారు. ఇక వరుస విజయాల గురించి అడగగా..  “నాకు ఎలాంటి సబ్జెక్టులు సూట్ అవుతాయి.. ఏవీ సెట్ కావు అనే విషయం అర్ధమైంది. ఏ వ్యక్తికి అయినా అభివృద్ధి చెందాలంటే ఎదురుదెబ్బలు అవసరం. నేను వాటి నుంచి చాలా నేర్చుకున్నా” అని నాగచైతన్య చెప్పారు. ఈ సినిమా ఆగస్టు 11 న రిలీజ్ కాబోతోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus